ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జనగామ, ఆగస్టు 15: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఆదివారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో మిషన్ భగీరథ కార్యక్రమం క్రింద 830 కోట్ల రూపాయల వ్యయంతో 610 అవాసాలకు శుద్ది చేసిన గోదావరి జలాలను అందిస్తున్నామని తెలిపారు. దేశంలో వందశాతం అవాసాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన నీరు అందించిన రాష్ట్రము తెలంగాణ అని ఆయన అన్నారు. 50 వేల లోపు రుణ మాఫీలో భాగంగా జనగామ జిల్లాలో 37 కోట్ల 94 లక్షల రూపాయలు, 11 వేల 957 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో 19 కోట్ల రూపాయల వ్యయంతో 2 వేల 570 రైతు కల్లాల నిర్మాణాన్ని, 13 కోట్ల 64 లక్షల రూపాయల వ్యయంతో 62 రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశామన్నారు. జనగామ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం క్రింద 24 కోట్ల రూపాయల వ్యయంతో 483 అవాసాలలో పల్లె ప్రకృతి వనాలను, 35 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని గ్రామ పంచాయతీలలో వైకుంఠధామాల నిర్మాణాలను, 7 కోట్ల రూపాయల వ్యయంతో 281 డంపింగ్ యార్డుల నిర్మాణాని చేపట్టి పూర్తి చేశామని మంత్రి తెలిపారు.
జిల్లాలోని 12 మండల కేంద్రాలలో 4 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో త్వరలో బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం వివిధ శాఖలలో అత్యంత ప్రతిభ కనపరచిన అధికారులకు, ఉద్యోగులకు ఆయన ప్రశంస పత్రాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. నిఖిల, జనగామ శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డిసిపి శ్రీనివాస రెడ్డి, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, జనగామ ఆర్డీవో మధుమోహన్, జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, జనగామ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బి. విజయ, ఎంపిపి మేకల కళింగ రాజు, మునిసిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

బిజిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post