ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి

పత్రిక ప్రకటన–1

తేదీ : 15–08–2022

 

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుజాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డిపోలీసుల గౌరవ వందనం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసాపత్రాలు ప్రధానంమేడ్చల్–మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుంచామని ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు , నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కీసరలోని కలెక్టరేట్ కార్యాలయం పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి అభివృద్దిలో ముందుంచేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థులు చేసిన  సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి. ఈ సందర్భంగా  ఆయా శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లాలోని ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో   జిల్లా కలెక్టర్ హరీశ్, జెడ్పీచైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రరెడ్డి, రాచకొండ డిసిపి మహేష్ భగవత్, అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్, మల్కాజిగిరి డివిపి రక్షిత మూర్తి, కుషాయిగూడ ఎసిపి. రష్మిత పెరమల్లు.. ఫ్రీడం ఫైటర్స్  శ్రీ కాశీవిశ్వనాథ్, శ్రీమతి జనాబాయి, ఆర్డీవో రవి ,కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ,    ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

@@@@@@@

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంమేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుతేది: 15-08-2022  ముఖ్య అతిథిగౌ||  శ్రీ  చామకూర మల్లారెడ్డి గారి రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధి శాఖామాత్యులుస్థలం: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్, కీసరసందేశము ……..76 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న మీకు మరియు సమస్త జిల్లా ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియ పరుచుచున్నాను. ఈ సందర్బంలో మన జిల్లా నూతన కల్లెక్టరేట్ భవన సముదాయాన్ని గౌరవ ముఖ్య మంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారిచే తేదీ 17-08-2022 నాడు ప్రారంబించ బడుతున్నదని తెలియ పరుచుటకు సంతోషిస్తున్నాను మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను తేది 08-08-2022 న ప్రారంభించిన విషయం మీకు విదితమే.  ఈ కార్యక్రమాలు   22-08-2022 వరకు  జరుగుతున్నందున జిల్లా ప్రజలందరూ ఉద్యమ స్పూర్తి తో  పాల్గొన వలసిందిగా కోరుచున్నాను. ఈ శుభ సందర్బంగా వివిధ రంగాలలో మన జిల్లా సాధించిన ప్రగతి నివేదికను మీ ముందర తెలియపరుచుచున్నాను.            పరిశ్రమల శాఖ:    తెలంగాణ రాష్ట్రoలో పారిశ్రామిక అనుమతులు స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం (TSiPASS Act,2014) క్రింద ఇప్పటి వరకు ఐదు వేల రెండు వందల యాబై ఒక్క (5251) మంది  ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివిధ శాఖల నుండి ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు (8976) పరిశ్రమలకు అనుమతులు ఇప్పించడం జరిగింది . ఈ జిల్లాలో  ఇప్పటి వరకు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు (9675) సూక్ష్మ, చిన్న, మధ్య తరహా మరియు భారీ పరిశ్రమలు,  సుమారు పదకొండు వేల కోట్ల తొమ్మిది వందల ముప్పై ఐదు లక్షల (రూ. 11,935) రూపాయల పెట్టుబడి తో స్థాపించబడి, సుమారు రెండు లక్షల పదమూడు వేల (2,13,000) మందికి ఉపాధి కల్పిస్తూన్నాయి.  నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన జనరల్ మరియు ఎస్సి / ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు వివిధ రాయితీలు (పెట్టుబడి రాయితీ, పావలావడ్డీ రాయితీ, పన్ను రాయితీ విద్యుత్ ఛార్జి రాయితీ) ఇవ్వడం జరుగుతుంది .టి-ఐడియా (T-IDEA) పథకం క్రింద ఇప్పటి వరకు 3,364 మంది పారిశ్రామికవేత్తలకు  రూ. మూడు వందల ఇరవై ఎనిమిది (రూ. 328) కోట్ల రాయితీలు ఇవ్వడం జరిగింది. టి-ప్రైడ్ (T-PRIDE) పథకం క్రింద ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల ఐదు “2305” పారిశ్రామిక వేత్తలకు రెండు వందల పది కోట్ల నలబై ఎనిమిది (రూ. 210.48) లక్షల రూపాయల రాయితీలు ఇవ్వడం జరిగింది.                ఘటకేసర్ మండలంలోని మాదారం గ్రామంలో సర్వే నెం. “225” లో “171” ఏకరాల, “9” గుంటల భూమిని రైతుల నుండి సేకరించి త్వరలో  ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పుటకు గాను TSIIC అధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కార్మిక  శాఖ:    తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం క్రింద నమోదు చేసుకున్న”1397” నిర్మాణ కార్మికుల లబ్ధిదారులకు, బోర్డు ఈ పథకాలను అమలు చేస్తోంది, ఈ పధకం క్రింద ఆగష్టు, 2022 వరకు మొత్తం (రూ. 7.42) ఏడు కోట్ల నలబై రెండు లక్షల రూపాయలు పంపిణీ చేయబడినది.

వ్యవసాయ శాఖ: రాష్ట్రం లోని వ్యవసాయ దారులందరికి పంట పెట్టుబడి కొరకు  ఆర్ధిక సహాయము అందచేయుటకు  “రైతు బంధు పథకం” 2018 సంవత్సరము నుండి ప్రవేశ పెట్టబడి నిరంతరాయముగ అమలు కాబడుతుంది. ఈ పథకం అమలు ద్వారా వ్యవసాయ రంగ ప్రగతి, ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో గణనీయమైన మార్పు జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మన జిల్లాలో 2022-23 సంవత్సరానికి వానాకాలం మరియు యాసంగి పంట పెట్టుబడి క్రింద రెండు సీజన్లకు ఒక ఎకరాకు 10,000/- రూపాయలు చొప్పున, 34 వేల 474 మంది రైతులకు 100కోట్ల 91లక్షల రూపాయలు రైతు బంధు సహాయం అందించడమైనది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే, రైతు జీవిత భీమా పధకం క్రింద, మన జిల్లాలో ఇప్పటివరకు 371 మంది చనిపోయిన రైతు కుటుంబాలకు, 18 కోట్ల 55 లక్షలు రూపాయలు నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగినది. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. రైతులకు కావాల్సిన విత్తనాలను, ఎరువులను ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేస్తున్నది. మన జిల్లాలో 1 కోటి 98 లక్షల రూపాయల వ్యయంతో 9 రైతువేదికల నిర్మాణము పూర్తిచేసి రైతులకు శిక్షణలు చర్చాగోష్టులు నిర్వహించడం జరుగుచున్నది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ: జిల్లాలో 2021-22 సం. లో  3928 హెక్టర్  లలో ఉద్యాన పంటల సాగు జరిగింది. సమీకృత ఉద్యాన అభివృద్దిపథకం లో భాగం గా పండ్లు మరియు కూరగాయల సాగుకు అయ్యే ఖర్చులో 40% రాయితీ పైన అందించడం జరిగింది.

అటవీ శాఖ: జిల్లాలో తెలంగాణకు హరిత హారం క్రింద 2022-23 సంవత్సరానికి గాను అరువది మూడు (63) లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యాలు నిర్దేశించినబడినవి. ఇప్పటి వరకు సుమారు 27 లక్షలు మొక్కలు నాటబడినవి.

వైద్య మరియు ఆరోగ్య శాఖ: మన జిల్లాలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 పట్టాన ఆరోగ్య కేంద్రాలు 1 ఏరియా ఆసుపత్రి, 64 బస్తి దవాఖానాలు , 35 పల్లె దవాఖానాలు మరియు 103 ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా వైద్య ఆరోగ్య సంక్షేమ సేవలను జిల్లా ప్రజలకు అందించటం జరుగుతున్నది. ఈ సంవత్సరం జిల్లాలోని PHC శామీర్పేట్, 30 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించబడుతున్నది.   జిల్లాలోని ఆల్వాల్ లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) వేయి పడకల ఆసుపత్రిని వేయి కోట్ల రూపాయల వ్యయంతో  నిర్మాణము చేయుటకు గౌరవ ముఖ్య మంత్రి గారి చేతులమీదుగా శంకుస్థాపన చేయబడినది. జిల్లా వైద్య విధాన పరిషత్ పరిదిలోని శామీర్ పేట మరియు మేడ్చల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్న స్థాయి ఆసుపత్రులుగా  మార్చటం జరిగింది. ఘటకేసర్ సెంటర్ కు ఆరు పడకల గల డయాలిసిస్ సెంటర్ ను మంజూరు చేయబడినది. జిల్లాకు  ఈ సంవత్సరము 234 లక్షల రూపాయల వ్యయంతో (18) బస్తి దవాఖానాలు మంజూరు చేయబడినది. వీటి నిర్మాణం ఈ నెలాఖరు వరకు పూర్తవుతుంది.

పౌరసరఫరాల శాఖ|˜           యాసంగి 2022-23(రబీ) లో మేడ్చల్ జిల్లా లోని 11 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2656 రైతుల నుండి సుమారుగా 11,011 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసి 21.58 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది. జిల్లాలో 636 చౌక ధరల దుకాణముల ద్వారా మొత్తం 5,24,301 ఆహార భద్రత కార్డుల ద్వారా 17.29 లక్షల  యూనిట్లకు ఆగస్టు మాసము కు గాను 26352 మెట్రిక్ టన్నుల బియ్యం, 2026 మెట్రిక్ టన్నుల గోధుమలు మరియు 18 టన్నుల చక్కెర పంపిణీ చేయడం జరిగినది .జిల్లాలో  కొత్తగా 57,388  ఆహార భద్రత కార్డులు మంజూరు చేయబడినవి.

గ్రామీణాభివ్రుద్ది సంస్థ.. జిల్లాలో ఆసరా పెన్షన్ క్రింద  వృధ్యాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు మరియు ఒంటరి  మహిళలకు ప్రతి నెల ఒక్కొకరికి రూ. 2016 మరియు దివ్యాంగులకు రూ. 3016 చొప్పున మొత్తం 1,02,508 ఫించనుదార్లకు గాను 23.41 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో జిల్లా సమాఖ్య (5) మండల సమాఖ్యలు ద్వార (118) గ్రామ సంఘాలు, 35,419 స్వయం సహాయక సంఘాలు పనిచేయుచున్నాయి. బ్యాంక్ లింకేజ్ లో ఉత్తమ ప్రగతి సాదించినందుకు జిల్లాకు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ అవార్డ్ మరియు ప్రశంసా పత్రం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుకోవడం జరిగింది. 2022-23 సంవత్సరమునకు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా పదకొండు (11) లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పిటి వరుకు సుమారు ఐదు లక్షల పదిహేడు వేల (5,17,000) మొక్కలను నాటడం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ: ఈ శాఖ పరిధిలో జిల్లా యందు (13) బాలుర మరియు (7) బాలిక గృహములు నిర్వహించబడుతున్నవి. ఇందులో “1922” బాలురకు మరియు “930” బాలికలకు అన్ని సౌకర్యములతో వసతి కల్పించనైనది.

వెనుకబడిన (బి.సి.) మరియు ఆర్దికంగ వెనుకబడిన (ఇ.బి.సి) తరగతుల విద్యార్ధినీ విద్యార్ధులకు ఉపకార వేతనము మరియు ఫీజు రియంబర్స్ మెంట్ పధకం కింద 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడుయేట్ వరకు చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకు రెండు వందల ముప్పై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల (రూ.233.75) రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. నాయీ బ్రాహ్మణులు మరియు రజకులచే నిర్వహించబడుచున్న హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్, లాండ్రీ షాప్ మరియు ధోబిఘాట్ లకు  “250” యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పధకం క్రింద జిల్లాలో “2705” మంది నాయీ బ్రాహ్మణులు మరియు “4428” మంది రజకులు లబ్దిపొందుతున్నారు.

షెడ్యుల్డ్ కులాల సంక్షేమ శాఖ:  షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ పరిధిలో బాలురు మరియు బాలికలకు ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల కోసం మొత్తం (10) వసతి గృహాలు నిర్వహించ బడుచున్నాయి. ఇందులో “433” బాలురకు మరియు “156” బాలికలకు వసతి కల్పించడమైనది. జిల్లాలో అంబెడ్కర్ విదేశీ విద్య నిధి కింద “28” షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు, ఐదు కోట్ల నలబై మూడు లక్షల (రూ. 5.43) రూపాయలు మంజూరు చేయ బడినవి.

దళిత బంధు:     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద షెడ్యూల్డ్ కులాల అబ్బివృద్ధి కొరకు ప్రతిస్టాత్మకంగా ప్రారంబించిన తెలంగాణ దళిత బంధు పధకం క్రింద ప్రతి శాసనసభ నియోజిక వర్గానికి 100 మంది చొప్పున లబ్దిదారులకు ఒక్కొకరికి పది (రూ. 10.00) లక్షల రూపాయలను పూర్తి సబ్సిడీతో ఇవ్వడం జరుగుతున్నది.              జిల్లాలో ఐదు (5) శాసనసభ నియోజిక వర్గాల పరిధిలో మొత్తం 500 మంది లబ్దిదారులకు యాబై (రూ. 50.00) కోట్ల రూపాయలు మంజూరు చేయబడినవి.    షెడ్యుల్డ్ తెగల సంక్షేమ శాఖ:   జిల్లాలో (1) ప్రీ-మెట్రిక్ గిరిజన బాలుర వసతి గృహo మరియు (5) పోస్ట్ మెట్రిక్ గిరిజన బాల/ బాలికల వసతి గృహాలు కలవు. ఈ సంవత్సరము “8861” మంది విద్యార్థిని విద్యార్థులకు 50.06 కోట్ల రూపాయలు స్కాలర్ షిప్ ద్వారా అందిస్తున్నాము. జిల్లాలో గిరిజన విద్యార్థులకు అంబెడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకం ద్వారా ఈ సంవత్సరమునకు ఒక్కొక్క విద్యార్థికి 20.00 లక్షల చొప్పున “3” ముగ్గురికి 60 లక్షలు అందించుచున్నాము. అల్ప సంఖ్యాఖ సంక్షేమ శాఖ:  జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను “1850” మంది అల్ప సంఖ్యాఖ వర్గ విద్యార్ధులకు 755.80 లక్షల రూపాయలు ఉపకార వేతనముల క్రింద మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో ఎనిమిది అల్ప సంఖ్యాఖ వర్గాల గురుకుల పాఠశాలలు మరియు ఎనిమిది జూనియర్  కళాశాలలు “4880” విద్యార్ధులతో నడపబడుచున్నవి.

మహిళా, శిశు,  దివ్యాంగులు మరియు వ్రుద్యాప్య సంక్షేమ శాఖ: జిల్లాలో  ఆరోగ్యలక్ష్మి  పథకం  ద్వారా “6,794” మంది గర్భిణులకు మరియు 5,574 మంది బాలింతలకు  ఒక పూట సంపూర్ణ భోజనము అంగన్వాడీ  కేంద్రముల ద్వార అందజేయుచున్నాము. “7” నెలల నుండి “3” సంవత్సరము లోపు వయసుగల 57,988 పిల్లలకు నెలకు బాలామృతం మరియు “16”  గుడ్లు టేక్ హొం రేషన్ ద్వారా ఇవ్వబడుతున్నది.

యువజన  మరియు  క్రీడల శాఖ:    క్రీడా రంగం లో యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్  గ్రాంట్ క్రింద  ప్రభుత్వం 220.00 లక్షల అంచనాతో మైదానాలని నిర్మించుటకు మంజూరై  ప్రగతి లో ఉన్నవి. ప్రతి సంవత్సరం హకీంపేట్ క్రీడా పాఠశాలలో 4 వ తరగతి బాలబాలికలను ఎంపిక చేస్తూ ఉచిత విద్య, ఉచిత భోజనం తో పాటు ఉచిత  క్రీడల శిక్షణ ని కూడా అందిస్తున్నాం.  తెలంగాణ రాష్ట్రం లో ఆసక్తి చూపుతున్న యువత కి  ఉపాధి కల్పించడానికి  వృత్తి  నైపుణ్య  శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడo జరిగింది అందులో  నిపుణులైన ఫ్యాకల్టీ నియమించి,  శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరియు కంప్యూటర్, బ్యుటీషియన్ & టైలరింగ్ తరగతులు ప్రారంభించడమైనవి.              పంచాయితీ రాజ్ శాఖ:జిల్లాలో ఉన్న 61 గ్రామపంచాయితీలలో అన్ని గ్రామపంచాయితీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు కొనుగోలు చేయడమైనది మరియు ప్రతీ గ్రామపంచాయితీ పరిధిలో వైకుంఠ ధామాల నిర్మాణము, కంపోస్ట్ షెడ్ నిర్మాణము చేయబడి ఉపయోగించబడుతున్నవి. ప్రతి గ్రామంలో హరిత హారం మొక్కల నర్సరీ ఏర్పాటు చేయబడినది. అంతేకాకుండా గ్రామపంచాయితీ పరిధిలో అనుబంధ గ్రామాలతో కలుపుకొని జిల్లా పరిధిలోని గ్రామపంచాయితీలలో (81) పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయటము జరిగినది మరియు ప్రతి గ్రామములో క్రీడా ప్రాంగణము ఏర్పాటు చేయుట లక్ష్యముగా (59) గ్రామాలలో క్రీడా ప్రాంగనములు పూర్తీ చేయబడినవి మిగిలిన గ్రామాలలో పనులు ప్రగతిలో ఉన్నవి.

పట్టణ ప్రగతి: ప్రభుత్వము ప్రతిష్ట్రాత్మకముగా చేపట్టిన పట్టణ ప్రగతి పనులు మన జిల్లాలో ప్రజాప్రతినిధులు మరియు ప్రజా భాగాస్వామ్యముతో నిరంతరాయముగా నిర్వహించబడుతున్నవి. జిల్లాలో ఉన్న నాలుగు కార్పోరేషన్-లలో మరియు తొమ్మిది మునిస్పిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలు మరియు హరిత హారం మొక్కలకు నీరు పట్టుట కార్యక్రమాలు నిరంతరము జరుగుతున్నవి. ప్రతి మునిసిపాలిటీ మరియు మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో వైకుంఠ ధామాలు/కంపోస్ట్ షెడ్ నిర్మాణము చేయబడి ఉపయోగించబడుతున్నవి.  జిల్లలో (135) హరిత హారం మొక్కల నర్సరీ మరియు (262) పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయబడినవి. పట్టణములో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటు చేయటం జరిగినది. ఇంటింటికి తడిపొడి చెత్త నిర్వహణ జరుగుతున్నది. ప్రతి ఇంటికి ఆరు మొక్కల పంపిణీ మరియు చెత్తను వేరు చేయుటకు చెత్త బుట్టల పంపిణి చేయుట జరిగినది. ప్రతినెలా ప్రభుత్వము విడుదల చేయుచున్న పట్టణ ప్రగతి నిధులు 2022-23 సంవత్సరనకుగాను ఇప్పటి వరకు రూ. 465 లక్షలు రూపాయిలు విడుదల చేయనైనది. పారిశుధ్యము పచ్చదనము నిర్వహణ చేయబడుతున్నది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుల మరియు మోడరన్ వైకుంటధామాలు నిర్మాణము చేపట్టబడినది, ఇట్టి నిర్మాణమునకు రూ. 12.27 కోట్లు మంజూరు చేయబడినవి.

రెండు పడకల గదులు గృహాలు:  ఈ పధకం క్రింద,  జిల్లాలో మొత్తం 2350 గృహాలు కేటాయించబడ్డాయి. ఇందులో 639 గృహాల నిర్మాణము పూర్తికాబడినవి. ఇందుకుగాను 34.00 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడినది. ఇంకను, 340 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయి మరియు 1329 గృహాలకు టెండర్లు జరుగుతున్నాయి.

పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ శాఖ:పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వివిధ పథకాల ద్వారా జిల్లాలో గుర్తించిన 486 అబివృద్ధి పనులు సుమారు ఎనిమిది కోట్ల ఏడు (రూ.807.00) లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణాలు జరుగుతున్నవి.  మత్స్యశాఖ: సమీకృత మత్శ్య అబివృద్ధి పథకం ద్వార ఉచిత చేప పిల్లల సరఫరా పథకం క్రింద 2022-23 సంవత్సరానికి గాను  జిల్లా లో 100% సబ్సిడీ ద్వారా 333 చెరువులకు 91.00 లక్షల చేప పిల్లలు విడుదలకు ప్రణాళిక సిద్దం చేయబడినది.

విద్యాశాఖ: మన జిల్లా యoదు మొత్తం 515 ప్రభుత్వ / లోకల్ బాడీ /ఎయిడెడ్ పాఠశాలలు విద్యాసంవత్సరం 2022-23 నందు పనిచేయుచున్నవి.మన ఊరు మన బడి, మన బస్తి మన బడి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి, మన బస్తి మన బడి కార్యక్రమంలో మన జిల్లాలో నుండి మొత్తం 176  పాఠశాలలను గుర్తించడం జరిగింది ఇలా గుర్తించిన 176 పాఠశాలలో 12 అంశాలలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది కొన్ని పాఠశాలలో పనులు ప్రారంభంచడం జరిగినది, తద్వారా విద్యార్థులకు విద్యపై మక్కువ కనపరిచి వారి బంగారు భవిష్యత్తుకు దోహదపడుతుంది.

మధ్యాహ్న భోజనం పథకము  2022-23 విద్యా సంవత్సరంలో జిల్లాలో వివిద పాఠశాలలో చదువుతున్న సుమారు 98,733 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయటం జరుగుతుంది.  జాతీయ పాఠ్యపుస్తకాల పంపిణీ క్రింద విద్యార్థులందరికీ 2022-23 విద్యా సంవత్సరంలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయడమైనది.

పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ: ఈ శాఖ  ద్వారా గొర్రెల అభివృద్ది పధకము క్రింద మన జిల్లాలో ఇప్పటి వరకు 48.82 కోట్ల రూపాయల వ్యయంతో, 3864 గొర్రెలను, 75 శాతం సబ్సిడి పై గొల్ల, కురమలకు పంపిణి చేయడo జరిగినది.  గేదెలు / ఆవులు పంపిణి పధకము క్రింద, 284 పాడి పశువులను 75 శాతం సబ్సిడి పై 2.27 కోట్ల రూపాయల వ్యయంతో పాలసహకార సంఘం సభ్యులకు పంపిణీ చేయడo జరిగినది మరియు పశువులకు ఈ జిల్లాలో 2 అత్యవసర సంచార పశువైధ్యశాలలను ఏర్పాటు చేయడము జరిగినది. జిల్లా ప్రజా పరిషత్:  2022-23 సంవత్సరమునకు జిల్లా పరిషత్ సాదారణ నిధుల ద్వారా 13 పనులకు అంచనా వ్యయం రూ.32.00 లక్షలు  మoజూరుచేయబడ్డాయి. రాష్ట్రం ఆర్ధిక సంఘము ద్వారా జిల్లా ప్రజా పరిషత్ 2022-23 సంవత్సరమునకు రూ. 22.85 లక్షలు మoజూరు కాబడినవి. రాష్ట్రం ఆర్ధిక సంఘము ద్వారా మండల్ ప్రజా పరిషత్ లకు 2022-23 సంవత్సరమునకు రూ. 30.27 లక్షలు మoజూరు కాబడినవి.

కళ్యాణ లక్ష్మి – షాదీముబారక్: పేద ఆడపిల్లల పెళ్ళి తల్లిదండ్రులకు భారం కాకుండా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పధకం క్రింద లక్షా 116 రూపాయలు చొప్పున ప్రతి ఆడపిల్లకు అందించుచున్నాము. ఈ జిల్లాలో ఇప్పటివరకు 13289 మంది లబ్దిదారులకు సుమారు 132.94 కోట్ల రూపాయలు పంపిణీ చేయబడినవి.

మిషన్ భగీరథ:  మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాకు మిషన్ భాగీరథ  ద్వారా 89 కోట్లు ఖర్చుతో  ఓఆర్ఆర్ వెలుపల ఉన్న 45620 గృహాలకు  త్రాగునీటి సరఫరా నవంబర్ 2017 నుండి జరుగుతూ ఉంది.  రాబోయే కాలంలో అందరమూ ఇలాగే కలిసిమెలిసి  సమాలోచనలు, సమీక్షలు చేసుకుంటూ జిల్లాను అన్ని రంగాలలో మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు వెళదామని, దానికి మీ అందరి సహకారం  ఉంటుందని  ఆశిస్తూ…..మన సిరుల గిరి – మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

జై తెలంగాణ – జై భారత్

 

Share This Post