ప్రచురణార్థం-3
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 28: ఘనపూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అభినందించారు. ఆరోగ్య కేంద్రానికి 9305 స్కోరుతో జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపు లభించగా, గురువారం సిబ్బంది జిల్లా కలెక్టర్ ను కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందిని అభినందిస్తూ, రాష్ట్రంలో 136 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ఇట్టి గుర్తింపు రాగా, వాటిలో ఘనపూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం 3వ స్థానంలో ఉందని, ఈ గుర్తింపు 3 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. సౌకర్యాలు మెరుగుపర్చుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. గుర్తింపుకు కృషి చేసిన జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. శ్రీరామ్ ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఉప జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. కొమురయ్య, వైద్యాధికారులు డా. ఉమాదేవి, డా. రచన, డిపివో చిరంజీవి, డిక్యుఎం భానుకుమార్, హెచ్ఎస్ రాజేశ్వరి, ఎల్టీ రజిత, ఏఎన్ఎం సుజాత, వినోద తదితరులు ఉన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.