ఘనపూర్ మండలంలోని వివిధ గ్రామాలను సందర్శించి, బృహత్ పల్లె ప్రకృతి వనాల పనితీరును పర్శీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.    తేది:22.12.2021, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కొరకు ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఘనపూర్ మండలంలోని వివిధ గ్రామాలను సందర్శించి, ఘనపూర్ లోని ఐదు ఎకరాల బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. డిసెంబర్ చివరి నాటికి అన్ని బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. షాపూర్ గ్రామంలోని నర్సరీని సందర్శించి, మొలకలు రానటువంటి బ్యాగులలో మళ్ళీ విత్తనాలని వేయాలని ఆయన సూచించారు. ఆముదం బండ తండాలోని 10 ఎకారాల బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, పల్లె ప్రకృతి వనం యొక్క పనితీరు సరిగా లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలలో ప్రతిరోజు నీరు అందించటం, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటటం, పిచ్చిమొక్కలని ఎప్పటికప్పుడు తీసివేయాలని, ఎప్పటికప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేవిగా పల్లె ప్రకృతి వనాలను తీర్చిదిద్దాలని ఆయన తెలిపారు.
రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని బృహత్ పల్లె ప్రకృతి వానలను సందర్శిస్థానని, ఎక్కడ పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని, ఎక్కడైనా పిచ్చి మొక్కలు కనపడితే ఉపేక్షించేది లేదని, శాఖా పరమైన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంట డి ఆర్ డి ఓ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post