ఘనపూర్ లో స్వర్ణ విజయ్ వర్ష విజయ యాత్ర, సైనికుల మోటార్ బైక్ ర్యాలీ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన
20 .9 .2021
వనపర్తి

సైనికుల్ని గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడం మేనని ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

సోమవారం స్వర్ణ విజయ్ వర్ష విజయ యాత్ర వనపర్తి జిల్లా ఘనపూర్ చేరుకోవడంతో మంత్రి తో పాటు సైనికుల మోటార్ బైక్ ర్యాలీ ఘన స్వాగతం పలికారు. వనపర్తి జిల్లాలోని చారిత్రాత్మకమైన ఖిల్లా గణపురం చేరుకున్న మోటార్ సైకిల్ యాత్ర లెఫ్టినెంట్ కల్నల్ లక్ష్మణ్ సింగ్ ఆధ్వర్యంలో మంత్రి మోటర్ సైకిల్ పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాదం సరోజినీ దేవి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని 132 కోట్ల ప్రజలు నిర్భయంగా జీవిస్తున్నామంటే దానికి కారణం సైనికులు అని అన్నారు. దేశ సరిహద్దులను కాపాడుతూ 24 గంటలు పని చేస్తున్న సైనికులకు మనం గౌరవించాలని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపేందుకు సైనికులు 1300 కి.మీ మేర మోటార్ సైకిల్ యాత్ర చేపట్టారని యాత్ర వనపర్తికి రావడం చారిత్రక ఖిల్లా ఘణపురం కోట దర్శించడం గర్వకారణమన్నారు. దేశాన్ని కాపాడేది సైనికులు అయితే, దేశ ప్రజల కనీస అవసరాల కోసం దేశ సార్వభౌమాధికారం పార్లమెంట్ ద్వారా చట్టాలు చేసి వాటిని అమలు పరచడం వాటివల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. పొరుగు దేశాల వల్ల మనకు ఎలాంటి హాని రాకుండా ఎప్పటికప్పుడు దేశ సైనికులు దేశానికి కంటికి రెప్పలా కాపలా కాస్తూ మన కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారు అని అన్నారు. దేశభక్తి నినాదం కాదని ఆచరణలో పెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి లెఫ్టినెంట్ కల్నల్ కు జ్ఞాపికను బహూకరించారు. ఈ ర్యాలీలో 450 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శిస్తూ 600 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో AJC వేణు గోపాల్ డీఎస్పీ కిరణ్ కుమార్ deo రవీందర్, సబ్ మేజర్ విజయ్ సింగ్, సిఐలు మల్లికార్జున్రెడ్డి, ప్రవీణ్ కుమార్, కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్, జడ్పిటిసి, ఎంపీపీ, గ్రామ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు..

…. జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post