చదువుతో పాటు పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

చదువుతో పాటు పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన                                                                                                                                                                                                                                                   తేదిః 04-09-2021

చదువుతో పాటు పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

            జగిత్యాల, సెప్టెంబర్ 09: కరోనా కారణంగా పాఠశాల వాతావరాణానికి దూరమై, చాలాకాలం తరువాత ఈనెల 1వ తేది నుండి విద్యాసంస్థల పునఃప్రారంభించి ప్రత్యక్ష తరుగతుల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించడంతో, పాఠశాలలకు తిరిగి వచ్చే విద్యార్థులకు చదువుతో పాటు మొదటగా ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. శనివారం జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల్లోని తాటిపెల్లి, దరూర్ లలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖి చేశారు.  ఈ సందర్బంగా ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్న తరుణంలో, ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలలో మొదటి రోజు నుండి నేటి వరకు పోల్చుకుంటే విద్యార్థుల సంఖ్య క్రమంగా 21% నుండి 40% వరకు పెరిగిందని, సోమవారం నాటికి విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కోన్నారు. పాఠశాలల్లో సానిటేషన్, పరిశుభ్రత చర్యలతో పాటు, కరోనా ప్రోటోకాల్ అమలుపై టీచర్లు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం జరిగిందని, విద్యార్థులకు అన్ లైన్ తరగతుల ద్వారా పాఠాలు చెప్పినప్పటికి, చదువులో కొంత వెనకబడినట్లు గుర్తించడం జరిగిందని, నేరుగా తరగతులను నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సబ్జెక్టుపై ఆసక్తిని పెంపోందించగలుగుతామని.  ఈ విద్యాసంవత్సరంలో ప్రత్యక్ష తరగతుల మొదటిరోజు నుండి అన్ని సబ్జెక్టులను మొదటి నుండి చెప్పించడం, పిల్లలతో టీచర్లు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా విద్యార్థులలో మరింత ఆసక్తిని పెంపోందించగలుగుతామని పేర్కోన్నారు.  అంతకు ముందు  విద్యార్థులతో తరగతుల నిర్వహాణ, ఆన్లైన్ ప్రత్యక్ష తరగతుల నిర్వహాణ, మద్యాహ్నభోజనం మొదలగు అంశాలను గురించి చర్చించి, టీచర్ల ద్వారా జరుగుతున్న పాఠాలను గురించి విద్యార్థులను ప్రశ్నించారు.  విద్యార్థులందరికి పుస్తకాలను పంపిణి చేయాలని,  నిత్యం సానిటేషన్ పనులు సక్రమంగా జరగాలని, 10వ తరగతి విద్యార్థులపై ఎక్కువ శ్రద్దను కనబరచాలని పేర్కోన్నారు. మద్యాహన భోజనం కొరకు వినియోగిస్తున్న గది, బియ్యం మరియు ఇతర సరుకులను పరిశీలించి, అనంతరం తాటిపెల్లి అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు.

ఈ పర్యటనలో జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి ఆర్.డి. మాదురి, ఎడి శివకృష్ణ, తదితరులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

చదువుతో పాటు పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

చదువుతో పాటు పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post