చదువుతో పాటు మానసిక ఉల్లాసం, ఉత్సాహం ఉండాలంటే ఆటలలో పాల్గొనాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రికా ప్రకటన                                                                తేది: 20-1-2023

చదువుతో పాటు మానసిక ఉల్లాసం, ఉత్సాహం ఉండాలంటే  ఆటలలో పాల్గొనాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యత కలిగి ఉండాలని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

శుక్రవారం కంచుపాడు గ్రామంలోని సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞానకేంద్రంలో సెంట్రల్ డెవలప్మెంట్ సోషల్ ప్రోగ్రెస్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సెంట్రల్ డెవెలప్మెంట్ సోషల్ ప్రోగ్రెస్ (సీడీఎస్పీ,)వారు  ఎన్ జి ఓ తరపున  గ్రామానికి సమాజ సేవలు చేయడం అభినందనీయమని అన్నారు. సంక్రాంతి పురస్కరించుకుని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ సోషల్ ప్రోగ్రాం, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించినపోటీలలో పిల్లలు పాల్గొనడం చాలా ముఖ్య మని,  చదువుతో పాటు ఆటలు ఏర్పాటు చేసి,    మానసిక  ఉల్లాసానికి ఆటలు ఎంతో అవసరమన్నారు. గ్రామయువత ఆధ్వర్యంలో సామాజిక, ఆరోగ్యసేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని  తెలిపారు. క్రీడలతో క్రమశిక్షణ మెరుగు పడుతుందన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్  , ప్రశంస పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి ప్రత్యేకంగా తిలకించారు.

ఈ కార్యక్రమంలో ఉండవెల్లి తహసిల్దారు బద్రప్ప,  కపిల్, సర్పంచు  శేషన్ గౌడ్, ఎంపీపీ బీసమ్మ, వైస్‌ఎంపీపీ దేవన్న, ఉండవల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు లోకేశ్వర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయుడు, ఎంపీవో పద్మావతి, సురవరం నివేదిత, తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————–జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ చే  జారి చేయబడినది.

Share This Post