చరిత్రను భావి తరాలకు తెలియపరచేందుకు తొలిసారిగా
రామాయణాన్ని రాసి ప్రపంచానికి తెలియపరచిన వాల్మీకి మహర్షి దైవంశ సమ్బోధుడని జిల్లా కలెక్టర్ డి. హరిచందన అన్నారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ హరిచందన వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాల్మీకి మహర్షి పట్టుదలతో పాటు స్పందించే గుణమైన గొప్ప మహానుభావుడని కొనియాడారు. 24 వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించారని, మంచి చెడు అనే వాటికి స్పష్టమైన వివరణలు వారి రచనల్లో కనిపిస్తాయన్నారు. వారిని ఆది కవి గా గుర్తింపు ఉందన్నారు. మహర్షి జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం సంతోషకరమైన విషయమని తెలియజేసారు. నేటి యువత మహర్షిని ఆదర్షంగా తీసుకొని చదువుల్లో పట్టుదల కనబర్చి ఉన్నత ఉద్యోగాలు సంపాదించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బి.సి. సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి, డి.పి.ఆర్.ఓ సీతారాం, వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, డి.పిఓ మురళి, ఏ.డి. సర్వే మొహ్మద్ మూసా, ఏ.ఓ నర్సింగ్ రావు, కలెక్టర్ పి.ఎస్. ఎండి ఖాలీద్ తదితరులు పాల్గొన్నారు.