చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు.

చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు. బుధవారం ఇటిక్యాల మండలం రాజశ్రీ గార్లపాడు లో నూతనంగా నిర్మించిన యుపిఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం అబ్రహంతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారికి విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాలలో గోడలపై విద్యాభ్యాసన బొమ్మలు విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో పెయింటింగ్ వేయడం జరిగింది.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టి జిల్లాలోని అనేక పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పించిందని ఇది చారిత్రాత్మక కట్టమని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిందుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటగా ఆర్గార్లపాడు గ్రామంలో ప్రారంభించడం జరిగిందని పిల్లలు అందరూ పాఠశాలకు వచ్చి బాగా చదవాలన్నారు.

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ప్రభుత్వం మొదలుపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులు కల్పించి ప్రారంభించడం జరిగిందని అన్నారు. జిల్లాలో 161 పాఠశాలలను మొదటి విడతగా ఎంపిక చేసి ఉపాధి హామీ పథకం ద్వారా టాయిలెట్లు, వంటగదులు,మేజర్ మైనర్ పనులను పూర్తి చేసిన్నట్లు తెలిపారు. గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యాభివృద్ధి కొరకు పాటుపడాలని, అప్పుడే గ్రామాలు సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని తెలిపారు.

అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా గార్లపాడు గ్రామంలో రూ .7 లక్షల 660 లు మంజూరు చేసి అన్ని వసతులతో పాఠశాల నిర్మించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పాఠశాలకు హాజరై విద్యాబోధన చేయాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. జిల్లాలోని మిగతా పాఠశాలలకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సెలవులు వస్తే పాఠశాల ఆవరణ ఏలాంటి చెత్తాచెదారం ఉండకుండా,ఇతరులు ఎవ్వరు కూడా కాంపౌండ్ లోకి రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలని  గ్రామస్తులు  బాధ్యత తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ సిరాజుద్దీన్, హెడ్మాస్టర్ కరేంద్రనాథ్, పంచాయతీరాజ్ ఎస్సీ శివకుమార్, డి ఈ సలాం,  ఉద్యాన వన శాఖ అధికారి అక్బర్, ఎంఈఓ రాజు, ఎంపిటిసి మల్లేష్, సర్పంచ్ పద్మా హుస్సేన్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

—————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాలచే జారీ చేయబడినది.

Share This Post