చల్మెడ ఆనంద రావు ఆస్పత్రిని సందర్శించిన : జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ

చల్మెడ ఆనంద రావు ఆస్పత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ

కరీంనగర్ లోని చల్మెడ ఆనంద రావు వైద్య కళాశాలలో దాదాపు వైద్య విద్యార్థులకు కరోనా వ్యాప్తి చెందినందున హాస్పిటల్ ను స్వయంగా కలెక్టర్ ఆర్. వీ కర్ణన్ మరియు పోలీస్ కమీషనర్ సత్యనారాయణ సోమవారం సందర్శించారు.

చల్మెడ ఆనందరావు వైద్య కళాశాల చైర్మన్ లక్ష్మి నరసింహారావు తో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కరోనా ఇతర వైద్య విద్యార్థులకు
వ్యాప్తి చెందకుండ కట్టుదిట్టమైన చర్యలు తీసు కోవాలని సూచించారు.
మాస్క్ ధరించని వారిపై, కఠినంగా వ్యవహారిస్తామన్నారు.ప్రతి ఒక్కరు బాధ్యతగా సామాజిక దురాన్ని పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, తరచు చేతులు శుభ్రపరుచు కోవాలని తెలిపారు. కరోనా సోకిన వైద్య విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించి కోలుకునేలా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా,వైద్య కళాశాల చైర్మన్ లక్ష్మి నరసింహారావు, ప్రిన్సిపాల్ ఆసిమ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Share This Post