చాకలి ఐలమ్మ చేసిన పోరాటమే మనకు స్ఫూర్తి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన ఆవరణలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మీతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిజాం సర్కార్ నుండి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట కాలంలో హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను భావితరాలు తెలుసుకునే విధంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, మహిళలు ఇంటికి మాత్రమే పరిమితమైన సమయంలో ఒక మహిళగా సమాజ శ్రేయన్సు కోసం పోరాడారని తెలిపారు. మహనీయులు చూపిన అడుగుజాలలో నడుస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కె.నత్యనారాయణ, ఎం.పి.పి. అరిగెల నాగేశ్వర్‌రావు, రజక సంఘం నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post