చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం వీరనారి చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని సోమవారం స్థానిక ధర్నా చౌక్ లో గల వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ లతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణా కే ఆమె లీడర్ అని స్త్రీ, పురుష సమానత్వం కోసం, రైతుల కోసం, అన్ని వర్గాల హితం కోసం ఐలమ్మ పోరాడారని, వారి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, స్థానిక కార్పొరేటర్ జార్జ్ క్లైమెట్, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, జిల్లా రజక సంఘం సీనియర్ నాయకులు జక్కుల లక్ష్మయ్య, జక్కుల వెంకటరమణ, ఎస్సి సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుపాకుల యలగొండ స్వామి, బిసి సెల్ అధ్యక్షులు మేకల సుగుణారావు, జాతీయ బిసి సంఘం జిల్లా నాయకులు పిండిప్రోలు రామ్మూర్తి, నగర కన్వీనర్ కనతాల నర్సింహారావు, ఎస్సి సాధన సమితి జిల్లా అధ్యక్షులు దుంపటి నగేష్, టౌన్ నాయకులు గడ్డం ఉపేందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post