చారిత్రక ఆధ్యాత్మిక కట్టడం బౌద్ధ స్థూపం మరింత అభివృద్ధి పర్చి పర్యాటక కేంద్రంగా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం |

ఆగష్టు, 27 ఖమ్మం :

చారిత్రక ఆధ్యాత్మిక కట్టడం బౌద్ధ స్థూపం మరింత అభివృద్ధి పర్చి పర్యాటక కేంద్రంగా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం భౌద్ధ స్థూపాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. భౌద్ధ స్థూప ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా సుందరంగా తీర్చిదిద్దాలని ప్రజలకు అవసరమైన ప్రస్తుత ఏర్పాట్లు అందుబాటులోకి తెచ్చి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించే విధంగా అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించారు. బౌద్ధ స్థూపంతో పాటు పట్టణ ప్రాంతాల్లో పచ్చధనాన్ని మరింత పెంచేందుకు విరివిగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని గ్రామంలో కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మొక్కను నాటారు.

జిల్లా పర్యాటక శాఖాధికారి సుమన్ చక్రవర్తి, ఇరిగేషన్ శాఖ ఇఇ. సమ్మిరెడ్డి, మండల ప్రత్యేక అధికారి విరూపాక్షి, ఎం.పి.డి.ఓ. చంద్రశేఖర్, డిప్యూటీ తహశీల్దారు వనజ, గ్రామ సర్పంచ్ బ్రహ్మయ్య, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post