చారిత్రాత్మక వారసత్వ సంపదను కాపాడుకోవాలి:: జిల్లా కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య

జనగామ, అక్టోబర్ -25: చారిత్రాత్మక వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందనీ జిల్లా కలెక్టర్ సి. హెచ్ శివలింగయ్య అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో పురాతన అతి ప్రాచీనమైన త్రికూట దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారితో పురావస్తు శాఖ అధికారులు త్రికూట ఆలయం యొక్క విశిష్టతను తెలియ జేస్తూ ఈ ఆలయం ఒక రాతి శాసనం ప్రకారం నిర్మించారని, సుమారు క్రీ.శ.1890 సంవత్సరం నాటి ఈ దేవాలయం శిధిలావత్సలో వుందని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు అధికారులతో ఆలయ పునర్నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని పురావస్తు శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావు, ఆర్డీఓ ఎ.మధుమోహన్, పురావస్తు శాఖ డి.డి. నారాయణ, ఎంపిడిఓ ఎండి ఆశిమ్, అధికారులు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి జనగామచే జారీ చేయడమైనది.

Share This Post