చిగురుమామిడి మండలకేంద్రం లో పోషన్ అభియాన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, DWO పద్మావతి.(కరీంనగర్ జిల్లా).

పత్రికాప్రకటన                                                                        తేదిః 25-01-2022
కరీంనగర్

మహిళల ఆరోగ్యం తోనే ఆరోగ్యవంతమైన సమాజం

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

పాల్గోన్న అధనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

00000

మహిళలు అరోగ్యంగా ఉంటెనే  కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు.

మంగళవారం  చిగురుమామిడి మండల కేంద్రంలోని అంగన్ వాడి కేంద్రంలో నిర్వహించిన పోషన్ అభియాన్ కార్యక్రమంలో అయన పాల్గోన్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,  జిల్లాలోని అన్ని అంగన్ వాడి కేంద్రాలలో పోషన్ అభియాన్ కార్యక్రమాలను సమర్దవంతంగా నిర్వహిస్తున్నారని మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య  శాఖ అధికారులను కలెక్టర్  అభినందించారు.   అంగన్ వాడి కేంద్రాలలో ఎ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లలు, అంగన్ వాడి వర్కర్ల సమిష్టి కృషి వల్ల గర్బిణులు, శిశువులు అరోగ్యవంతంగా ఉంటున్నారని తెలిపారు.   గర్బీణిలకు ఇచ్చె పోషక ఆహారం కోడి గుడ్లను వారే తినాలని సూచించారు.  ప్రతి మంగళవారం అంగన్ వాడి కేంద్రాలలో పోషన్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎత్తు, బరువు తక్కువగా ఉండే శిశువులను గుర్తించి వారికి పోషక ఆహారంతో పాటు మందులను అందిస్తున్నారని,  దీనిని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  గర్బీణీలు అంగన్ వాడి కేంద్రాలలో అందించే పోషక ఆహారాన్ని తీసుకోని ఆరోగ్యవంతులుగా ఉండాలని కలెక్టర్ అన్నారు. రక్త హీనతతో బాదపడే మహిళలు,యువతులు, గర్బీణిలను గుర్తించి మందులు పోషక ఆహారం అందివ్వాలని,  అంగన్ వాడి కేంద్రాల నిర్వహకులకు సూచించారు.  తద్వారా అనిమియా ముక్త్ జిల్లాగా మార్చాలని అన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ,  గత ఎడాది సెప్టెంబర్ నుండి జిల్లాలో పోషన్ అభియాన్ కార్యక్రమాలను జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో  ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎత్తు, బరువు తక్కువగా ఉండే శిశువులపై ప్రత్యేక దృష్టిసారించి వారి ఎదుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.  గత ఏడాది 1024 పిల్లల ఎదుగుదల తక్కువగా ఉండగా ఆ సంఖ్యను ప్రస్తుతం 422 కు తగ్గించామని తెలిపారు.  వచ్చే 6 నెలల్లో పూర్తిగా తగ్గించేందుకు కృషిచేస్తామని తెలిపారు.   అన్ని శాఖల సమన్వయంతో  జిల్లాను అనిమియా ముక్త్ గా మరియ పోషన రహిత కరీనగర్ జిల్లాగా మార్చుతామని అదనపు కలెక్టర్ తెలిపారు.

అనంతరం మహిళలు వేసిన రంగోళి ముగ్గులను కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తిలకించి అభినంధించారు.

ఈ కార్యక్రమంలో చిగురుమామిడి యంపిపి వినిత,  జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డా. జువేరియా, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, ఎంపీడీవో విజయలక్ష్మి,కరీంనగర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు రూరల్ సిడిపిఓ సబితా, సర్పంచ్ బెజ్జంకి లక్మణ్, అంగన్ వాడి వర్కర్లు, ఎ.ఎన్.ఎం.లు, ఆశావర్కర్లు, గర్బీణిలు, మహిళలు పాల్గోన్నారు.

సహాయ సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, కరీంనగర్ గారిచే జారిచేయనైనది.

చిగురుమామిడి మండలకేంద్రం లో పోషన్ అభియాన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, DWO పద్మావతి.(కరీంనగర్ జిల్లా).

Share This Post