చిట్యాల గ్రామం వద్ద రెండు పడక గదుల ఇండ్లు, మార్కెట్ యార్డ్, వనపర్తి నూతన కలెక్టరేట్ భవనం, నర్సింగ్ కళాశాల పనులు తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన, తేది:1.12.2021, వనపర్తి.

నిరుపేదల కోసం నిర్మించే రెండు పడక గదుల ఇండ్లు త్వరలో పంపిణీ నిర్వహించుటకు అన్ని ఏర్పాటు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
బుధవారం వనపర్తి పరిధిలోని చిట్యాల గ్రామం వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఇంటిలో కిచెన్, బాత్రూం, బెడ్ రూమ్ సౌకర్యాలతో పాటు, విద్యుత్ సదుపాయం, రోడ్లు, తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లను, అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా అందమైన మొక్కలు నాటాలని ఆమె సూచించారు.
అనంతరం చిట్యాల మార్కెట్ యార్డ్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆమె అధికారులకు తెలిపారు. నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి, కలెక్టరేట్ ఆవరణలో అందమైన మొక్కలను నాటాలని, నూతన కలెక్టరేట్ భవనం పరిసరాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. అనంతరం నర్సింగ్ కళాశాల పనులను ఆమె పర్యవేక్షించారు. నర్సింగ్ కళాశాల పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంట్రాక్టర్లకు, సంబంధిత అధికారులకు తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట అధికారులు, కాంట్రాక్టర్లు,  తదితరులు ఉన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post