చిట్యాల, చిమనగుంటపల్లి, అంకూర్ గ్రామ పంచాయతీలలోని వరిదాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రిక  ప్రకటన
తేది 29.11.2021, వనపర్తి.

ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులకు లబ్ధి చేకూరేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులకు ఆదేశించారు.
సోమవారం వనపర్తి మండలంలోని చిట్యాల,  చిమనగుంటపల్లి, అంకూర్ గ్రామా పంచాయతీలలోని  వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్యాడి క్లినర్లు, ఎలాక్ట్రానిక్ వేయింగ్ మెషిమ్లా, ధాన్యం తడవకుండా టార్ఫిన్ల  ఏర్పాట్లపై రైతులకు ఆమె తగు సూచనలు అందచేశారు. వరిదాన్యం కొనుగోలు చేసి, ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆమె తెలిపారు.
భారత  ఆహార సంస్థ (FCI) దాన్యం  కొనుగోలు చేయడం లేదని, యాసంగిలో వరి వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాలని, ఇతర పంటలకు ప్రాధాన్యతనివ్వాలని ఆమె సూచించారు. రైతులు   నాణ్యమైన పంటను కేంద్రాలకు తేవాలని, తేమ శాతాన్ని పరిశీలించి, వెంటనే కొనుగోలు చేయాలని ఆమె సూచించారు.
రైతు వేదికలలో మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారని, ఆధార్ నెంబర్లు, పస్  బుక్ లింకులు ఎప్పటికప్పుడు తెలుసుకొని టోకెన్లు ఇవ్వాలని, డిజిటల్, మాయిశ్చ ర్ మీటర్ ను తనిఖీ చేసి, క్వాలిటీ మెయింటెన్ చేయాలని, డేటా ఎంట్రీని తప్పనిసరిగా చేయాలని, ధాన్యం తూకం వేసిన వెంటనే రైతులకు రిసిప్ట్ అందచేయాలని ఆమె అధికారులకు సూచించారు. హమాలీల లేనిపక్షంలో రైతులు వేచి చూడరాదని, రైతులు సహకరించి వరి ధాన్యం గోనె సంచులు నింపేందుకు చర్యలు తీసుకోవాలని, రైతుల సమన్వయంతో సహాయం చేయాలని ఆమె తెలిపారు. రైతులు అందరూ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవటం పూర్తిచేయాలని ఆమె తెలిపారు. అంకూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ కీ జిల్లా కలెక్టర్ నోటీసులు ఇవ్వవలసిందిగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట రైతు సమితి అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, అడిషనల్ డి ఆర్ డి ఓ రేణుక దేవి, పి పి సి ఇంచార్జ్ చెన్నయ్య, సివిల్ సప్లై మేనేజర్ అనిల్ కుమార్, ఆర్. ఐ.  ఆసిఫ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
…………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ  చేయనైనది.

Share This Post