చిన్నంబావిలో దళితులకు భూమి కొనుగోలు పట్టాల పంపిణీ కార్యక్రమం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి

పత్రికా ప్రకటన
6 9 2021
వనపర్తి

తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేస్తున్నదని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.

సోమవారం జిల్లా పరిధిలోని కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి లో జరిగిన దళితులకు భూమి కొనుగోలు పట్టాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు స్థానిక శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, తో కలిసి భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కొరకు అనేక పథకాలను చేపట్టిందని అన్నారు. నేటి కాలంలో ఎంతో విలువైన భూమిని కొనుగోలు చేసి పేద దళితులకు అందజేస్తున్న దని అన్నారు. ఇంతే కాక ఈ భూమి పొందిన రైతుకు ఒక సంవత్సరం పెట్టుబడి సాయం కూడా అందజేస్తామని అన్నారు. ఇంతేకాక 162 మందికి వ్యక్తిగతంగా రూ 50 వేలు రుణం అందజేయడానికి గుర్తించామని అన్నారు. దీంతో స్వయం ఉపాధి పొందవచ్చని అన్నారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పేద దళితులను గుర్తించి వారికి మూడెకరాల భూమి అందజేయడానికి చర్యలు తీసుకున్నదని అన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని వ్యవసాయానికి పెద్దపీట వేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గా భూమి హక్కు పొందిన లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా 24 మందికి 23 ఎకరాల 10 గుంటల భూమి పత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ లోక్ నాథ రెడ్డి యం.పి.పి. సర్పంచ్లు ఎంపిటిసి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి లబ్ధిదారులు పాల్గొన్నారు..

… జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయనైనది.

 

 

Share This Post