చిన్నారులో పోషణ లోపం లేకుండా చూడాలి కలెక్టర్ హరీష్

చిన్నారులో పోషణ లోపం లేకుండా చూడాలి కలెక్టర్ హరీష్

రక్తహీనత, పౌష్టికాహార చిన్నారులు పోషణ లోపం లేకుండా చూడాలి కలెక్టర్ హరీష్ ఉన్న, గర్భిణీ స్త్రీలు, బాలింతలను, పోషణ లోపం ఉన్న చిన్నారుల ను గుర్తించి విముక్తి కల్పించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. పోషన్ అభియాన్ మాసోత్సవం సందర్భంగా మహిళా , శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో అనుబంధ శాఖలతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ జ్యోతి ప్రజ్వల గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళ గర్భం దాల్చిన నుండి వెయ్యి రోజుల పాటు పౌష్టికాహారం అందేలా చూడాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో బలహీనంగా ఉన్న పిల్ల ల బరువు చూసి పౌష్టికాహారం అందేలా చూడవలసిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు. భవిష్యతులో శ్రేష్టమైన మానవ వనరులను అందించుటకు ఆశా వర్కర్లు, ఏ.యెన్.ఏం.లు, అంగన్వాడీ టీచర్లు, వైదులతో పాటు సంబంధిత అధికారులు సమిష్టిగా కృషిచేస్తూ గ్రామా పంచాయతీ, మునిసిపాలిటీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పిల్లలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తయారు చేసే విధంగా వారి ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. గ్రామ, మండల వారీగా బలహీనంగా ఉన్న చిన్నారులు, రక్తహీనత తో బాధపడుచున్న గర్భిణీలు, బాలింతల జాబితా రూపొందించి అందుకనుగుణంగా వారిలో ఐరన్, హిమోగ్లోబిన్ బాగుండేలా, అనీమియా లేకుండా , చిన్నారులు పోషణ లోపం లేకుండా చూసేలా కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నారు. పోషణ మాసం సందర్భంగా ఈ నెల 30 వరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుండడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పోషణ లోపాలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం అందేలా చూడాలని, ఇది నిరంతర ప్రక్రియగా జరగాలని అప్పుడే ఆరోగ్యవంతులైన భావి పౌరులను సమాజానికి అందించిన వారమవుతామని అన్నారు. ఈ సందర్భంగా గోడపత్రికలను ఆవిష్కరించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖా, పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పౌష్టికాహారం అందించడంలో ఉన్న అంతరాలను గుర్తించి వాటిని అధిగమిస్తూ తల్లిదండ్రులలో అవగాహాన కల్పించి పోషణ లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జయరాం నాయక్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి.ఓ. తరుణ్ కుమార్, డి.ఏం.అండ్ హెచ్ ఓ. వెంకటేశ్వర్ రావు, డా.సుమిత్ర, వైద్యాధికారులు, సి.డి.పి .ఓ.లు, సూపర్ వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, యెన్.జి.ఓ. ప్రతినిధి సునీత, తదితరులు పాల్గొన్నారు.

Share This Post