చిన్న పిల్లలకు కొత్తగా ప్రవేశ పెట్టిన న్యూమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సినేషన్‌ పై ప్రజలకు అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్‌ శర్మన్

అయిదు సంవత్సరాల లోపు వయస్సు పిల్లకు వచ్చే  న్యూమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాధి నుండి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ ప్రవేశ పెట్టడం జరిగిందని, దీనిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్ తీసుకునే విధంగా విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యాక్సిన్ అవగాహన పై టాస్క్ ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు కొత్తగా వస్తున్న న్యూమోకొక్కల్ వ్యాధి, వాటి లక్షణాలు, టీకా ఆవశ్యకత పై ఆశ వర్కర్లు, ఏ.ఎన్. యం ల ద్వారా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించి దీనికి సంబంధించిన వ్యాక్సిన్ తప్పకుండా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ మాట్లాడుతూ న్యూమోకొక్కల్ వ్యాధి వల్ల 5 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు జ్వరం రావడం, ఊపిరితిత్తులలో సమస్య తలెత్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి అన్నారు. సకాలంలో సరైన వైద్యం అందని పక్షంలో ప్రాణాలకు ముప్పు ఉంటుందని వివరించారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు న్యూమోకొక్కస్ కాంజుగేట్ (పి.సి.వి) అనే కొత్త టీకా ను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి డోస్ 6 వారాల్లో ఇవ్వాలని, రెండవ డోస్ 14వ వారంలో బూస్టర్ డోస్ ను 9 నెలలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా టీకా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి బిడ్డకు ఈ టీకా ఇవ్వడం వల్ల న్యూమోకొక్కస్ వ్యాధి నుండి బయట పడవచ్చని తెలియజేసారు. టీకా తీసుకోవడం వల్ల పిల్లలకు ఎలాంటి సేడ్ ఎఫెక్ట్ ఉండవని, టీకా చాలా సురక్షితమైనదని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————
జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా జారీ.

Share This Post