సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన జూమ్ మీటింగ్ లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సి డి పి వో ల వారీగా పోషకాహార లోపంతో ఉన్న పిల్లల సంఖ్య, రక్తహీనతతో ఉన్న పిల్లల సంఖ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల అంగన్వాడి కేంద్రంలో కార్యకర్తలు చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు చేసి యాప్ లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఎత్తుకు తగ్గ బరువు, బరువు తగ్గ ఎత్తు లేని పిల్లలు అధికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి పర్యవేక్షకులు, సిడి పి వో లు కేంద్రాలను పరిశీలించి వివరాలు సక్రమంగా నమోదు చేశారో లేదో చూడాలని పేర్కొన్నారు. వివరాల నమోదులో తప్పులు లేకుండా తగిన జాగ్రత్తలు అంగన్వాడి కార్యకర్తలు తీసుకోవాలని చెప్పారు. జూమ్ మీటింగ్లో సి డి పి వో లు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారీ చేయనైనది.