చిన్న వయసులోనే రక్తహీనతను తగ్గించుకోవడం ద్వారా విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం.

డిశంబరు, 02, ఖమ్మం:–

చిన్న వయసులోనే రక్తహీనతను తగ్గించుకోవడం ద్వారా విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. అనీమియా ముక్త భారత్ కింద కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ఐరన్ ట్యాబ్లెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ లాంచనంగా ప్రారంభించి విద్యార్థినీ విద్యార్థులచే ఐరన్ ట్యాబ్లెట్లను మింగించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ సరియైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల, నులి. పురుగుల వల్ల రక్తహీనత సమస్యలు ఏర్పడతాయని చిన్నారులను మొదలుకొని మధ్యవయస్కుల వారి వరకు ప్రతి ఒక్కరిని రక్తహీనత నుండి కాపాడేందుకు అనీమియా ముక్త భారత్ కింద పలు కార్యక్రమాలు చేపడ్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు ఐరన్ ట్యాబ్లెట్లను పంపిణీ చేసి ప్రతి గురువారం మధ్యాహ్న భోజన అనంతరం ఒక ట్యాబ్లెట్ తీసుకునే విధంగా సైన్స్ ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆకుకూరలు, పాలు, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి విముక్తి కలుగుతుందన్నారు. ప్రధానంగా గర్భిణీలు, కౌమర్య దశ బాలికలు తగు జాగ్రత్తలు పాటించాలని. కలెక్టర్ సూచించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య, డాక్టర్ సైదులు, పాఠశాల: ప్రధానోపాధ్యాయులు మాధవరావు, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సూర్యనారాయణ, తహశీల్దారు. మంగీలాల్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post