చిమ్నా తండా పంచాయతీ నూరు శాతం వాక్సినేషన్ సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్  అభినందించారు.

ఈ గ్రామం మన జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ స్థాయిలో నిలిపిందని చెప్పారు.    మంగళవారం సుజాతనగర్ మండలం, చిమ్నా తండా గ్రామం నూటికి నూరు శాతం వాక్సిన్ ప్రక్రియ పూర్తి కావడం పట్ల అభినందించారు.    గ్రామంలో వాక్సిన్ ప్రక్రియ  నూరుశాతం సాధించడంపై ఏర్పాటు చేసిన అభినందన  సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారం వల్లే  మారుమూల ప్రాంతమైన చిమ్నా తండా లో వాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయగలిగామని చెప్పారు. ఈ గ్రామాన్ని    ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని వాక్సిన్ పూర్తి చేయడంలో  మన జిల్లాను రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలిపారని చెప్పారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలే వాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. జనవరి నుండి ఇప్పటి వరకు 3 లక్షల డోస్ లు వాక్సిన్ వేస్తే ఈ వారం నిర్వహించిన ప్రత్యేక వాక్సిన్ కార్యక్రమంలో లక్ష దోసులు వాక్సిన్ వేశామని చెప్పారు.  వాక్సిన్ తీసుకోడం రామరక్ష అని చెప్పారు.  కరోనా వ్యాధి నుండి రక్షణకు వాక్సిన్ తీసుకోవడం చాలా ముక్యమని వాక్సిన్ తీసుకున్న తదుపరి మన పనులను మనం సక్రమంగా చేసుకోవచ్చని ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.  మీరు బంధు మిత్రులకు తెలియ చేసి వాక్సిన్ వేసుకునే విదంగా అవగాహన కల్పించాలని చెప్పారు.  అనంతరం సింగభూపాలెం గ్రామ పంచాయతిని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గ్రామ సభ తీర్మామనం ప్రకారం పనులు చేపట్టాలని చెప్పారు.  పంచాయతి పరిధిలో నూరు శాతం వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం వాక్సిన్ కొరకు వచ్చిన ప్రజలతో వాక్సిన్ తీసుకోవడం వల్ల ఉపయోగాలపై అవగాహన కల్పించారు. అనంతరం సింగభూపాలెం చెరువు కట్టను పరిశీలించారు.  చెరువు కట్ట కోతకు గురి కాకుండా మొక్కలు నాటాలని చెప్పారు. ప్రజలు వాకింగ్ చేయుటకు వీలుగా పూల మొక్కలు పెట్టి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి విజయ లక్ష్మి, తహసిల్దార్ సునీల్ రెడ్డి, ఎంపిడిఓ వెంకట లక్ష్మీ, ర.భ ఈ ఈ భీంలా, డిఈ నాగేశ్వరరావు, వైద్యాధికారి నాగమణి,  సర్పంచు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. చిమ్నా తండా గ్రామం నూటికి నూరు శాతం వాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసి ప్రకటించడం పట్ల ఆశా, అంగన్ వాడి, వైద్య, కారదర్శి సర్పంచ్ తదితరులను  శాలువతో సన్మానించారు. అనంతరం వాక్సిన్ ప్రక్రియ నూరు శాతం పూర్తి కావడం పట్ల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Share This Post