చిరుధాన్యాలు ఆహారంగా తీసుకుంటే వ్యాధులు దూరం: జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

చిరుధాన్యాలు ఆహారంగా తీసుకుంటే వ్యాధులు దూరం: జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

——————————-

చిరుధాన్యాలు ఆహారంగా తీసుకుంటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అన్నారు.

సిరిసిల్ల పట్టణం శుక్రవారం సాయంత్రం కొత్త చెరువు వద్ద పండుగ వాతావరణంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం జరిగింది.

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ….
చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని గురించే మంత్రి శ్రీ కే తారక రామారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నింటి లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో …
చిరుధాన్యాల ప్రాధాన్యత ప్రతి గడపకూ చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

ఉద్యమ స్ఫూర్తితో …
చిరుధాన్యాల ప్రాధాన్యత ప్రతి గడపకూ చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

L విద్యార్థులు స్వయంగా తయారుచేసిన వంటకాలతో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం, అభినందనీయమని అన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల లైఫ్ టైం రోగాల బారి న పడుతున్నట్లు తెలిపారు. దేశంలో నే అత్యధిక యువత, ముఖ్యంగా యువతులు, బాలికలు ఎనీమియా బారిన పడుతున్నట్లు తెలిపారు. డైట్ ను డైవర్సిటీ చేసుకుంటే జీవితకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చునని చెప్పారు.

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ…. పోషకాహారం తీసుకోవాల్సి న అవసరాన్ని నొక్కి చెప్పేందుకే ప్రభుత్వం 2018 లో పోషణ అభియాన్ కు శ్రీకారం చుట్టిందనీ అన్నారు.
చిన్నపిల్లల్లో మిల్లెట్ అవసరం తెలియడం ఆదిశగా సానుకూల మార్పులు రావడం గొప్ప విషయం అన్నారు. జిల్లా కేంద్రాలలో మాదిరే అన్ని మండల కేంద్రాలలో కూడ వీటిని నిర్వహించాలని అన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్, zp చైర్ పర్సన్ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ లో 15 స్కూల్ లు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ లను పరిశీలించారు. ఫుడ్ ను రుచి చూసారు.

ఈ సందర్భంగా విద్యార్ధుల సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందo కళా చక్రపాణి, DEO రాధా కిషన్, ఎంపిపి లు, ZPTC లు పాల్గొన్నారు.

——————————–

 

Share This Post