చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన తేది:15.08.2022, వనపర్తి.

వనపర్తి జిల్లాలో చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
సోమవారం వనపర్తి పరిధిలోని పానగల్ రహదారిలో నిర్మించిన చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయానికి అదనపు గదులు, రికార్డుల గదులకు, మరమ్మతులకు గాను సుమారు రూ.60 లక్షల అంచనా వ్యయంతో కార్యాలయాన్ని నిర్మించినట్లు మంత్రి వివరించారు. అదనపు గదుల ద్వారా ఇరిగేషన్ శాఖ సిబ్బంది సేవలకు సౌలభ్యంగా ఉంటుందని, పనులలో జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ రఘునాథరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఎన్. వెంకట్ రెడ్డి, పెబ్బేర్ ఇరిగేషన్ ఎస్.ఈ. సత్యశీల రెడ్డి, ఇరిగేషన్ ఈ. ఈ. మధుసూదన్ రావు, డీ.ఈ.లు, ఎ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post