చునావ్ పాఠశాలలను, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ను ఏర్పాటు చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లా లోని ప్రతి ఒక్క ఉన్నత పాఠశాలలో ELC క్లబ్ ను 9 వ, 10 వ తరగతి విద్యార్థులతో ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 01-01-2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ గా నమోదు చేయడానికి కృషి చేయాలనీ అన్నారు. జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాలలో చునావ్ పాఠశాలలను, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ లను ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఇప్పటికే ఓటర్ గా నమోదు అయినవారు వారి వివరాలను ఓటర్ల జాబితా లో ఏమైనా తప్పులున్నచో నిర్ణీత ఫారం లో పూర్తి వివరాలతో సరిచేసుకోవాలని అన్నారు. మొదటి, మూడవ శనివారాలలో చునావ్ పాఠశాలల కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. చునావ్ పాఠశాలల ఏర్పాటు, ELC క్లబ్ ల ఏర్పాటు కై స్వీప్ నోడల్ అధికారి డి.లక్ష్మణ్ అవగాహన కల్పించారు. ELC లకు సంబంధించి కార్యకలాపాలు, ఆటలను పవర్ పాయింట్ ద్వారా ప్రదర్శించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా విద్య శాఖ అధికారి ప్రణీత, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.

Share This Post