చూపు లేని ఎందరో దివ్యంగుల జీవితంలో అక్షర జ్యోతి వెలిగించిన మహా వ్యక్తి లూయిస్ బ్రెయిలి అని జిల్లా కలెక్టర్ డి. హరిచందన కొనియాడారు

చూపు లేని ఎందరో దివ్యంగుల జీవితంలో అక్షర జ్యోతి వెలిగించిన మహా వ్యక్తి లూయిస్ బ్రెయిలి అని జిల్లా కలెక్టర్ డి. హరిచందన కొనియాడారు.  లూయిస్ బ్రెయిలి జయంతిని పురస్కరించుకొని  సోమవారం కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బ్రెయిలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చూపులేకుండా అంధత్వంతో ఉన్న   దివ్యంగులకు లూయిస్ బ్రెయిలి లిపిని కనిపెట్టి ప్రతి కళ్లులేని దివ్యంగునికి చదువుకునేల చేశాడన్నారు.  నేడు బ్రెయిలి లిపితో ప్రపంచ వ్యాప్తంగా దివ్యంగులు చఫువుకొని ఉన్నత పదవులు, ఐ.ఏ.ఎస్ లు  అవుతున్నారని పేర్కొన్నారు.  జిల్లాలోని దివ్యంగులు పెదవారైన సరే బ్రెయిలి లిపిలో లక్షణంగా చదువుకోవచ్చని,  అందుకు తగిన పాఠశాలలు ఉన్నాయని వాటిలో చేర్పించి విద్యను అభ్యసించాలన్నారు. చూపు లేదని నిరాశ పడవలసిన అవసరం లేదని జిల్లాలో ఏ ఒక్క కళ్లులేని దివ్యంగుడు విద్యకు దూరం కావద్దని తెలియజేసారు.  బ్రెయిలి విద్యను అభ్యసించదలచిన దివ్యంగుల తల్లిదండ్రులు జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు.   దివ్యంగులకు ఉపయోగకరంగా ఉండేందుకు ట్రాన్సలేటర్ యంత్రాన్ని తెప్పించి అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం దివ్యంగులతో కలిసి కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, ఆర్.డి.ఓ వెంకటేశ్వర్లు, డి.సి.పి.ఓ కుసుమలత, సి.డి.పి.ఓ లు , దివ్యంగులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post