చెంచు పెంటల్లో నివసించే చెంచులకు మెరుగైన జీవన ప్రమాణాలు, జీవనోపాధి లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

చెంచు పెంటల్లో నివసించే చెంచులకు మెరుగైన జీవన ప్రమాణాలు, జీవనోపాధి లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం చెంచులు ఎదుర్కొంటున్న సమస్యల పై మన్ననూర్ అతిథి గృహంలో పి.ఓ ఐ.టి.డి.ఏ, ఫారెస్ట్, రెవెన్యూ, విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూమి సాగు చేసుకుంటున్న 230 మంది రైతులకు సంబంధించిన పట్టా పాస్ బుక్ ల విషయంలో ఉన్న సమస్యలను ఫారెస్ట్, ఐ.టి.డి.ఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెంచుల జీవన స్థితిగతులు మెరుగు పడటానికి, విద్య, వైద్యం, స్వయం ఉపాధి విషయంలో ఇప్పటి వరకు అనుసరిస్తూ వస్తున్న విధానాల పై వివరాలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఏలాంటి చర్యలు చేపట్టవచ్చు అనే విషయాలపై సమీక్ష నిర్వహించారు. పిల్లలకు మెరుగైన విద్య , అందరికి వైద్యం, జీవనోపాధికి నైపుణ్య శిక్షణ పై ఐ.టి.డి.ఏ, అటవీ శాఖ అధికారులతో చర్చించారు. చెంచుపెంటలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అటవీ శాఖ అనుమతుల పై విద్యుత్ శాఖ ఎస్.ఈ , అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. అటవీ శాఖకు, రెవెన్యూ శాఖకు మధ్య ఉన్న భూ సమస్యలు, సరిహద్దు సమస్యలపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఫీల్డ్ లబొరేటరీ , పర్యావరణ విద్యా కేంద్రాన్ని పరిశీలించారు.
ఐ.ఎఫ్.ఎస్. రోహిత్ రెడ్డి, డి.ఎఫ్.ఓ కిష్టా రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్ లాల్ , ఐ.టి.డి.ఓ పి.డి అశోక్, ఆర్.డి.ఓ పాండు నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share This Post