చెడిపోయిన శనగల కొనుగోలుకు బహిరంగ కొటేషన్ ల ఆహ్వానం- పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సుదర్శన్.

ఆగష్టు 05, 2021ఆదిలాబాదు:-

పౌర సరఫరాల గోదాం లో పాడైపోయిన శనగలను కొనుగోలు చేయడానికి బహిరంగ కొటేషన్ లను ఆహ్వానిస్తున్నామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సుదర్శన్ గురువారం జారీచేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గల పౌర సరఫరాల గోదాంలో 87.30 క్వింటాళ్లు చెడిపోయిన శనగలను బహిరంగ కొటేషన్ ద్వారా అమ్మడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల పప్పు పరిశ్రమలు, ట్రేడర్స్, ఎవరైనను ఈ నెల 13 లోగా బహిరంగ కొటేషన్ లను జిల్లా మేనేజర్ పౌర సరఫరాల కార్యాలయము ఆదిలాబాదులో సమర్పించవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 న అట్టి బహిరంగ కొటేషన్ లను పరిశీలించి ఎక్కువ ధర కోట్ (నమోదు) చేసిన వారికీ తూకం ప్రకారం శనగలను అమ్మడం జరుగుతుందని పేర్కొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post