చెరువులు, శిఖం భూములు ఆక్రమణల విషయంలో అధికారులు తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 5:

చెరువులు, శిఖం భూములు ఆక్రమణల విషయంలో అధికారులు తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో చెరువుల ఆక్రమణలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆక్రమణలతో చెరువులు తగ్గడంతో సాగు విస్తీర్ణంపై కూడా ప్రభావం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 68 చెరువుల్లో సుమారు 268 ఎకరాల మేర 353 మంది ఆక్రమణలో ఉందన్నారు. రెవిన్యూ, ఇర్రిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టి, చెరువుల ఆక్రమణ విషయంలో చర్యలు తీసుకొని, భూముల రక్షణ చేయాలని ఆయన తెలిపారు. చెరువుల ఆక్రమణలో పంటలు వేయకుండా ఇర్రిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ప్రతి చెరువులో ఎంత మేర ఆక్రమణ ఉంది, ఆక్రమణలో ఏమేం ఉన్నాయి గూగుల్ మ్యాప్ ల ద్వారా పరిశీలించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఇర్రిగేషన్ ఎస్ఇ శంకర్ నాయక్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాము, ఇర్రిగేషన్ అధికారులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post