చెస్ అకాడమీలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

చెస్ అకాడమీలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

చెస్ అకాడమీలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -07:

చెస్ అకాడమీలో నిర్వహిస్తున్న సమ్మెర్ క్యాంప్ ను జిల్లా కలెక్టర్ కె. శశాంక పరిశీలించారు.

శనివారం జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలలో సొషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో చెస్ అకాడమీ ద్వారా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోచ్ లు, పిల్లలతో మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి (20) మంది పిల్లలను ఎంపిక చేసి ఏప్రిల్ 23 నుండి మే-8 వరకు (15) రోజుల పాటు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి చెస్ లో శిక్షణ కల్పిస్తున్నట్లు కోచ్ గోపీకృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చెస్ శిక్షణ నిర్వహణ తీరు బాగుందని, ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ను నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలించాలని తెలుపుతూ, శిక్షణ పొందుతున్న పిల్లలతో శిక్షణా కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ పొందుతున్న అంతర్జాతీయంగ ప్రతిభ కనబరిచిన ఇద్దరు పిల్లలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో చెస్ కోచ్ గోపీకృష్ణతో పాటు కోచ్ జ్యోత్స్న, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post