చెస్ విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

చెస్ విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, జూలై -21:

చెస్ విజేతలను జిల్లా కలెక్టర్ కె. శశాంక అభినందించారు.

గురువారం కలక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక తన ఛాంబర్ లో కలిసిన చెస్ విజేతలను, కోచ్ లు సి హెచ్. గోపి కృష్ణ, జి.జ్యోత్స్న లను అభినందించారు.

అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా ఖమ్మం శ్రీ రామకృష్ణ విద్యాలయం లో బుధవారం నిర్వహించిన అండర్ -15, అండర్ -12 విభాగంలో జిల్లాకు చెందిన విద్యార్థినులు పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు కోచ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

అండర్ -15 విభాగంలో డి.దివ్య మొదటి బహుమతి, జి.ఆర్.శ్రీలేఖ, పి. సుధాశ్రీ రెండవ, మూడవ బహుమతులు కైవసం చేసుకున్నారని, అండర్ -12 విభాగంలో అర్షిత మొదటి, తదుపరి స్థానాల్లో జి.శ్రీలేఖ, కె.పూజ, ఎస్. లక్షిత, బి.పల్లవి లు కైవసం చేసుకున్నారని సోషల్ వెల్ఫేర్ మహబూబాబాద్ గర్ల్స్ చెస్ అకాడెమీ కోచ్ లు సి.హెచ్. గోపి కృష్ణ, జి.జ్యోత్స్న లు పోటీలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ కు వివరించారు.

Share This Post