చేనేతను ప్రోత్సాహించాలి:: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

జనగామ, ఆగస్ట్ 7: చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని శనివారం చేనేత, జౌళీ శాఖ అధ్వర్యంలో ఆర్ అండ్ బి అతిధిగృహం నుండి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి చేనేత లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు అందే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఒక వేయి 559 మందికి జియో ట్యాగింగ్ చేశామన్నారు. ఒక వేయి 459 మంది లబ్దిదారులకు రూ. కోటి 72 లక్షలు మంజూరు చేసి, నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం సబ్సిడి ఇస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోని ప్రభుత్వం ఉపాధి కల్పన దిశగా ముందుకు సాగుతుందన్నారు.
కార్యక్రమంలో చేనేత ప్రతిజ్ఞ చేయించి అందరూ చేనేత వస్త్రాల ధరించి చేయూత నివ్వాలని కోరారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, హ్యండ్లూం ఏడి ఎం. సాగర్, మునిసిపల్ వైస్ ఛైర్మన్ మేకల రాంప్రసాద్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ సుచిత్ర, కౌన్సలర్ గుర్రం భూలక్ష్మి నాగరాజు, పద్మశాలి సంఘ నేతలు వేముల బాలరాజు, రచ్చ క్రిష్ణ మూర్తి, రచ్చ బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారీ చేయనైనది.Share This Post