చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చేనేత కార్మికులకు భరోసా కల్పించారు.

.

పత్రికా ప్రకటన                                                      తేది: 08.10.2021

 

చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా  ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చేనేత కార్మికులకు భరోసా కల్పించారు.

శుక్రవారం గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో గల చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి జీవన స్థితిగతులను అడిగి  తెలుసుకున్నారు. చేనేత కార్మికులు మగ్గం పై చీరలు తయారు చేసే విధానం, వాటి అమ్మకాలు, ముడి సామగ్రి తదితర విషయాలను చేనేత కార్మికుల ను అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ వీవర్స్ ద్వారా తెచ్చుకుంటామని, చీరల రంగులు, డిజైన్ మాస్టర్ వివర్స్ తెలియజేస్తారని చేనేత కార్మికులు కలెక్టర్ కు వివరించారు. ముడి సామగ్రిని బెంగళూరు, ధర్మవరం నుండి  తీసుకు వచ్చి తమకు అందజేస్తారని చేనేత కార్మికులు కలెక్టర్ కు తెలిపారు. తాము పది గంటలపాటు మగ్గంపై పని చేస్తామని నెలకు రూ. 12000 ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ ఆదాయంతోనే తమ కుటుంబ పోషణ, పిల్లల చదువులు తదితర ఖర్చులు అవుతాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సహాయం  అందించాలని కోరారు. ఆన్లైన్ ద్వారా చీరలు విక్రయించు కోవచ్చు కదా అని కలెక్టర్ చేనేత కార్మికులను ప్రశ్నించగా ఇప్పటి వరకు ఆన్లైన్ మార్కెటింగ్ చేయలేదని , దీంతో తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చేనేత కార్మికులు తెలిపారు. నూతన టెక్నాలజీ ని  ఉపయోగించేందుకు   అవగాహన కల్పిస్తామని అన్నారు. చేనేత కార్మికులందరికి జాబ్ కార్డులు అందిస్తామని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి వివరిస్తామని ప్రభుత్వం ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామ ని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.

కార్యక్రమం లో చేనేత జౌళి శాఖ అధికారి గోవిందయ్య, శ్రీమన్నారాయణ కౌన్సిలర్, చేనేత కార్మికులు నాగ రాజు, భీమేశ్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయబడినది.

Share This Post