చేనేత రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత నిస్తుంది : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

చేనేత రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత నిస్తుంది : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

చేనేత రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత నిస్తుందనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల పాత బస్టాండ్ కూడలి లో ఉన్న నేతన్న విగ్రహానికి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఎన్ అరుణ రాఘవ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పూల మాలలు వేశారు.

చేనేత రంగానికి ప్రాధాన్యత నివ్వడంతోబాటు, నేతన్నను గౌరవించడం కోసం 2015 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
చేనేత రంగానికి దేశంలో అతి ప్రాచీన చరిత్ర ఉందని, భారతీయ చేనేత వస్త్రాలకు దేశవిదేశాల్లో ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రత్యేక చొరవతో నేత కార్మికులకోసం ప్రభుత్వ పరంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు

Share This Post