చేనేత వస్త్రాలను ధరించి కళా నైపుణ్యాన్ని, సాంస్కృతిక వారసత్వ సంపదను, చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి …… జిల్లా కలెక్టర్ కె. శశాంక

చేనేత వస్త్రాలను ధరించి కళా నైపుణ్యాన్ని, సాంస్కృతిక వారసత్వ సంపదను, చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి …… జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -07:

చేనేత వస్త్రాలను ధరించి కళా నైపుణ్యాన్ని, సాంస్కృతిక వారసత్వ సంపదను, చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్థానిక ఐ.ఎం.ఏ. హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా 2015 నుండి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ రంగం గురించి, దీని ప్రాముఖ్యతను తెలిసిన కూడా, మనం చూస్తుండగానే ఏ రకంగా కనమరుగు అవుతుందో గమనిస్తున్నామని, ఈ రంగంలో ఉన్న సమస్యలు, తీసుకోవలసిన చర్యలపై సంఘ ప్రతినిధులు మాట్లాడడం జరిగిందని, మన జిల్లాలో కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి అని, తొర్రూరు, పెద్ద వంగర, దంతాలపల్లి లో పెద్ద ముప్పారం వంటి కొన్ని ప్రాంతాల్లో దాదాపు 350 మంది చేనేత కార్మికులు పెన్షన్ లు తీసుకుంటున్నారని, దాని విషయంలో కూడా వెసలుబాటు కల్పించాలని చెప్పడం జరిగిందని, ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు. టెక్స్టైల్ పార్క్ వరంగల్ లో ఏర్పాటు అవుతున్నదని, చేనేత కార్మిక నాయకులు కోరినట్లు మన జిల్లాలో ఏర్పాటుకు సాధ్య, సాధ్యలపైన మాట్లాడి అవకాశం మేరకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని తెలిపారు.

నేతకు పట్టే సమయం, దాంట్లో పెడుతున్న ఖర్చు మిగతా వాటితో పోల్చితే అధికం కాబట్టి, అట్టి వస్త్రాల విషయంలో కూడా తీసుకోవలసిన జాగ్రత్తలు ఎక్కువ కాబట్టి ఇతరత్రా వైపు సాధారణంగా మొగ్గు చూపుతున్నారు అని తెలిపారు.

ప్రతి సోమవారం ప్రభుత్వ జిల్లా అధికారులు చేనేత దుస్తులు విధిగా ధరించాలని తెలిపామని, మార్కెట్ లో వినియోగదారునికీ అందుబాటులో ధర కానీ, రోజు వారి వేసుకొని మార్చడానికి కంఫర్ట్ అంశాల దృష్ట్యా ఆ ఉత్పత్తులు అపురూపమైన వస్తువుగా మారిందని, ఈ సమస్యలు, విషయాలపై చేనేత నేతన్నలు మాత్రమే కాకుండా ఉద్యోగులు కూడా ఆలోచించాలని, ఉద్యోగులు ధరించి ఇతరులకు చెప్పాలని, పండగల సందర్భంగా, ఇతర ఫంక్షన్
ల సందర్భంగా చేనేత దుస్తులను వాడాలని, ఉద్యోగులు మన బాధ్యతగా భావించాలని, పత్తి నుండి నూలు పోగుగా మార్చి, దానిని వస్త్రం రూపంలో తీసుకురావడం వృతియే కాదని, అది ఒక కళ అని, అందరివల్ల సాధ్యం కాదని, చాలా సేపు కూర్చొని చీర, వస్త్రాలు నేస్తారని, మగవాళ్ల కంటే మహిళలే ఎక్కువ నేస్థారని, వారికే ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని, గంటల తరబడి కష్టం ఉంటుందని, దానిపై ఆధారపడి అవస్థలు పడుతున్న సందర్భంలో ఆ రంగాన్ని, కుటుంబాలను కాపాడుకోవడానికి మన మీద, ఉద్యోగుల మీద బాధ్యత ఎక్కువగా ఉన్నదని తెలిపారు. హండ్లూమ్ వస్త్రాలు ప్రతి సోమవారం ధరించడమే కాకుండా, పండుగలకు, ఫంక్షన్ లకు తీసుకున్నట్లయితే ఎంతో కొంత సహాయపడి, చేనేత రంగాన్ని కాపాడిన వారమౌతమని, ఇది మన సాంప్రదాయం, మన సమాజం, దేశం ఔనత్యాన్ని కూడా నిలిపే గొప్ప వృత్తి కాబట్టి మనం మాట్లాడటం తో పాటు చేతల్లో కూడా చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు, ప్రతినిధులు చేసిన పలు సూచనలు, సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని, మన జిల్లాలో ఉన్న సమస్యలపై ప్రత్యేకంగా సమావేశమై వాటి పరిష్కారానికి చొరవ తీసుకొంటామని, మన జాతీయ వాదాన్ని, నేతన్నలకు చేయవలసిన సహాయ సహకారాలను గుర్తు చేసుకోవడానికి ఆ సందేశాన్ని, స్ఫూర్తిని మరొకమారు రగిలించడానికి ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపు కుంటున్నామని తెలిపారు.

మనం 75 వసంతాల స్వాతంత్ర్య భారతావనిలో ఉన్నామని, స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్పవారి గురించి మనం కథలుగా విన్నామని, ఇన్ని సంవత్సరాలుగా స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్న దృష్ట్యా ఆ జాతీయ భావాన్ని, దేశభక్తిని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ ఉత్సవాలు ఈ నెల 8 నుండి చేపట్టినందున ప్రతి గ్రామం, ప్రతీ మునిసిపాలిటీ, ప్రతి వార్డ్ లో, ప్రతి చోట ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ, చేనేత రంగం అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలనీ, అందరూ చేనేత వస్త్రాలు ధరించి ప్రోత్సహించాలని తెలిపారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, చేనేత దుస్తులు ధరించే పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రం, షీల్డ్ అందజేశారు. అలాగే చేనేత సంఘ నాయకులను సన్మానించారు.

అనంతరం చేనేత వస్త్రాలు దరిస్తానని, అందరూ దరించేటట్లు కృషి చేస్తామని, వారసత్వ కళా రంగాన్ని కాపాడుతమని ప్రతిజ్ఞ చేశారు.

అంతకుముందు జిల్లా కేంద్రంలోని రాం మందిర్ వద్ద గల జిల్లా సమైఖ్య భవనం నుండి ఐ.ఎం. ఏ. హాలు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘ నాయకులు గద్దె రవి, వెంకటేశ్వర్లు, వెంకన్న, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, పశు సంవర్దక శాఖ అధికారి డాక్టర్ టి. సుధాకర్, వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, ట్రైబల్ వెల్ఫేర్ డి.డి. ఎర్రయ్య, ఖుర్షీద్, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post