చేపలు రొయ్యల ఆహార ఉత్పత్తుల మేళాను సందర్శించి, తెలంగాణ రుచులను ఆస్వాదించండి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్
ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మత్స్య ఉత్పత్తుల ఆహార విక్రయ మేళా(ఫిష్ ఫెస్టివల్) ను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సూచించారు.
బుధవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్స్య ఉత్పత్తుల విక్రయ మేళ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ……
ప్రజలకు చేపల ద్వారా వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులు వాటి నుంచి వచ్చే పోషక విలువలు, వివిధ రకాల రుచులు పరిచయం చేయడానికి, చేపలు, రొయ్యల ఆహార ఉత్పత్తుల తయారీ వంటకాల మేలుకోవాలని నేర్పేందుకే ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ దిశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మత్స్య ఉత్పత్తుల ఆహార మేళా ను ప్రజలు అధిక సంఖ్యలో సందర్శించి, తెలంగాణ రుచులతోపాటు, చేప ఆహార విక్రయాల మెలకువలను నేర్చుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ కోరారు.
9 ఏళ్లలో జిల్లాలో మత్స్య సంఖ్య గణనీయంగా అభివృద్ధి చెందింది అన్నారు.
మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 10 స్టాల్స్‌లో వివిధ రకాలైన, రుచికరమైన చేపలు, రొయ్యల ఆహార ఉత్పత్తుల వంటకాలు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అందులో చేపల వంటకాలైన చేపల వేపుడు, రొయ్యల వేపుడు, చేప బిర్యాని, రొయ్య బిర్యాని, చేపల పకోడి, చేపల పులుసు, చేపల మంచూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే దాదాపు 20 మంది మహిళలకు ఎన్‌ఐటీహెచ్‌ఎం హైదరాబాద్‌లో చేపల వంటకాల తయారీలో శిక్షణ ఇచ్చామని, ఆసక్తిగల ఔత్సాహికులు తమ వంటల నైపుణ్యం ద్వారా వివిధ రకాలు తయారు చేసిన వంటలు ప్రదర్శించుటకు మత్స్యశాఖ అవకాశం కల్పిస్తుందని తెలిపారు.
విజయ డైరీ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల మను చౌదరి, అదనపు కలెక్టర్ రెవిన్యూ మోతిలాల్, జిల్లా మత్స్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మప్ప, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి వి రమేష్, డిఆర్డిఏ పిడి నర్సింగ్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీధర్ జి, తదితరులు పాల్గొన్నారు.
………………………….. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం నాగర్కర్నూల్ నుండి జారీ చేయడమైనది.