చైల్డ్ లైన్ వ్యవస్థ ను బలోపేతం చేయాలి…

ప్రచురణార్ధం

చైల్డ్ లైన్ వ్యవస్థ ను బలోపేతం చేయాలి…

మహబూబాబాద్, డిసెంబర్,21.

బాల్య వివాహాలు, బాలకార్మిక పర్యవేక్షక వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు బాలల హక్కులపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ లైన్ అడ్వైసరి బోర్డ్ సమావేశంను కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …2011-12 నుండి 3295 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 454 కేసులు నమోదయ్యాయి అన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసులలో 154 బాల్యవివాహాలు కాగా, 145 బాలకార్మికులు ఉన్నాయన్నారు. హై స్కూల్స్ లో పెయింటింగ్ పోస్టర్ను ఏర్పాటు చేయించాలని, అంగన్ వాడి కేంద్రాల్లో పోస్టర్స్ ఉంచాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి చైల్డ్ లైన్ సమావేశం కావాలన్నారు. మండల స్థాయిలో నెలకు ఒకసారి సమావేశం కావాలన్నారు, కార్యకలాపాలను సమీక్షించుకుంటూ నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అన్నారు. గ్రామస్థాయిలో బృందం పర్యటించినప్పుడు కేసులపై ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలని తద్వారా గ్రామ స్థాయి సిబ్బంది కి నమ్మకం పెరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు బాల రక్ష childline సఖి సెంటర్ మూడు విభాగాలు సమన్వయం పెంచుకొని సమాచారాన్ని పంచుకోవాలి అన్నారు. ప్రతి మూడు నెలలకోసారి మాస్ ప్రోగ్రాలు ఏర్పాటు చేసుకోవాలని, బాలల హక్కులు ఆరోగ్యంపై ప్రజాప్రతినిధులతో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఫిర్యాదులు వచ్చే చోట దృష్టి పెట్టాలని, మున్సిపాలిటీలలో యాచకులు పెరిగిపోతున్నదున తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలి అన్నారు. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు

జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి మాట్లాడుతూ అబార్షన్లు, అక్రమ  దత్తత లపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. కేసుల పరిష్కారంలో సత్వరమైన చర్యలు తీసుకుంటూ అధికారులకు సలహాలు, సూచనలు అందజేస్తున్నామని తెలియజేశారు. జిల్లాలో ఫోక్సో కేసులు పెరిగి పోతున్నాయని సామాజిక పరంగా చైతన్యం ఎంతో అవసరమన్నారు.  విద్య పై పట్టు పెంచాల్సిన అవసరం ఉందని, జాతరలో తప్పిపోయిన పిల్లల సమాచారం తెలిపేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. చైల్డ్ లైన్ కార్యకలాపాలపై విస్తృత ప్రచారం తో పాటు అవగాహన కూడా ఎంతో అవసరమన్నారు.

ఈ సమావేశంలో చైల్డ్ లైన్ డైరెక్టర్ చిన్నప్ప బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ నాగవాణి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనిన, వైద్యాధికారి  హరీష్ రాజు జిల్లా విద్యాధికారి మహమ్మద్ అబ్దుల్ హై, సఖి ప్రతినిధి శ్రావణి  సి డి పి వో లు నీలోఫర్ అజ్మీ, శిరీష డెబోరా పోలీసు అధికారులు చైల్డ్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
———————————————————————————————————
 జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post