చౌక ధర దుకాణాలకు అక్టోబర్ మాసం కు సంబంధించిన బియ్యం కోటా కేటాయింపు*

*కార్డు దారులకు నిర్దేశించిన ప్రకారం రేషన్ పంపిణీ:డి.ఎస్.ఓ.వెంకటేశ్వర్లు*
నల్గొండ,సెప్టెంబర్ 23.
 అక్టోబర్ ఒకటి నుండి రేషన్ కార్డు దారులు చౌకధర దుకాణాల నుండి ఉచితంగా రేషన్ తీసుకోవచ్చని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.వెంకటేశ్వర్లు తెలిపారు.అక్టోబర్ ఒకటి  లోపు అన్ని రేషన్ షాపులకు బియ్యం పంపడం జరుగుతుందని తెలిపారు.పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల ననుసరించి
 జిల్లాలోని 991 రేషన్ షాప్ లకి సంబందించిన బియ్యం కేటాయింపు విడుదల ఉత్తర్వులు ఎం.ఎల్.ఎస్.పాయింట్ లకు పంపించినట్లు తెలిపారు.అక్టోబర్ నెలకు సంబందించిన  జిల్లా రైస్ కోటా – 14839.800 మెట్రిక్ టన్నులు కాగా,అంత్యోదయ ఆహార భద్రతా కార్డుకు 35 కేజీలు + యూనిట్ కి 5 కేజీలు,ఆహార భద్రతా కార్డుకు
 యూనిట్ కి 10కేజీలు,అన్నపూర్ణ
 కార్డుకు 10కేజీలు + యూనిట్ కి 5కేజీలు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు.
అక్టోబర్ నెలకు సంబందించిన రేషన్ కార్డుదారులకు నిర్దేశించిన విధంగా పూర్తిగా ఉచితంగా రేషన్  పంపిణీ చేయవలసి ఉంటుందని ఆయన ఈ ప్రకటన లో తెలిపారు.

Share This Post