చౌడు నెల లలో కూడా సాగు చేసుకోవచ్చు-: జిల్లా కలెక్టర్ డి హరిచందన

చౌడు నెల లలో కూడా సాగు చేసుకోవచ్చు-: జిల్లా కలెక్టర్ డి హరిచందన

ఊట్కూర్ మండలం పగిడిమరి గ్రామం లో  రైతు వేదిక లో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సు లో జిల్లా కలెక్టర్ డి హరిచందన  మాట్లాడుతూ చౌడు నెల లలో కూడా సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు.   చౌడు నెల లో రాగి, ఉసిరి  ఇతర పంటలు సాగుచేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం రైతులు  ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపో రాదని, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు గ్రామ స్థాయి నుండి, రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి రైతులకు యాసంగి లో వరి సాగు చేయవద్దని, వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ సూచించారు. యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని, రైతులను చైతన్యం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసినట్లయితే ప్రభుత్వం నుండి సబ్సిడీ అందుతుందని, వాటిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వివరించారు. ఆరుతడి పంటలైన వేరుశనగ, పెసలు, నువ్వులు, ఆముదం, కుసుమ, కూరగాయలు తదితర 10 రకాలైన పంటలను సాగు చేయాలని ఆమె సూచించారు. రైతులు ఒకే రకం పంట ను పండించకుండా రైతులకుసంభందించిన పంట పొలాలలో భూసార పరీక్షకలు నిర్వహించి ఎరకం పంటలు పండించడానికి అణువు గా ఉంటుందో వ్యవసాయ అధికారు ల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఎంపిడిఓ, వ్యవసాయ అధికారులు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post