చౌడు భూమిలో వరి తప్ప వేరే పంట రాదు అనే రైతులకు ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులతో పాటు విత్తన డీలర్ల పై ఉందని జిల్లా కలెక్టర్ డి హరిచందన సూచించారు

చౌడు భూమిలో వరి తప్ప వేరే పంట రాదు అనే   రైతులకు ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులతో పాటు విత్తన డీలర్ల పై ఉందని జిల్లా కలెక్టర్ డి హరిచందన సూచించారు.

సోమవారం   నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామం రైతు వేదికలో జిల్లాలోని విత్తన డీలర్ ల తో  నిర్వహించిన సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సౌడు భూములలో సైతం ఇతర పంటలను పండించవచ్చనే విషయాన్ని  రైతులకు అవగాహన కల్పించి వారికి ఉన్న  అపోహలు తొలగించాలని తెలిపారు. రైతులు లాభ పడితేనే విత్తన వ్యాపారాలు కూడా బాగాఉంటాయని పేర్కొన్నారు.  రైతులకు యసంగి లో వరి కి బదులు గా ప్రత్యామ్నాయ పంటల ను పండించే విధంగా తీసుకువెళ్లాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆయిల్ ఫార్మ్, సేంద్రియ పంటలు,  వెరు శేనిగా, మినుములు, నువ్వులు, పెసర పొద్దుతిరుగుడు పత్తి మరియు   పండ్లు కూరగాయల పంట లు కూడా పండించేటట్లు చూడాలన్నారు. విత్తనా డీలర్ లు ప్రత్యన్మేయా పంటల సాగు కు సంభందించిన విత్తనాలు సిద్ధంగా ఉంచుకోవాలని కొనుగోలు కు వచ్చిన రైతుకు ఇతర పంటల పై మొగ్గు చూపే విధంగా అవగాహనా కల్పించాలన్నారు. రైతులకు ఎలాంటి విత్తనాలు కావాలన్న అందుబాటులో ఉంచుకోవాలని యాసంగి లో వచ్చే వరి నూకలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి FCI కొనుగోలు చెయ్యట్లేదు అని రైతులు నష్టంవాటిల్లకుండ ఇతర పంటలు వేసుకోవాలని వారికి సూచించాలని తెలిపారు. తక్కువ సమయం లో ఎక్కువ లాభాలు సంపాదించే పంటలు ఉన్నాయని వాటిని పరిచయం చేయాలనీ జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా విత్తనాల డిలర్లు తడి తరులు పాల్గొన్నారు.

Share This Post