ఛాత్​పూజకు అన్ని రకాల ఏర్పాట్లు కల్పించాలి + జిల్లా కలెక్టర్​ హరీష్

ఛాత్​పూజకు అన్ని రకాల ఏర్పాట్లు కల్పించాలి
+ జిల్లా కలెక్టర్​ హరీష్​
మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న చాత్​ పూజా కార్యక్రమాలకు జిల్లాలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్​ హరీష్​ అన్నారు. శనివారం కలెక్టరేట్​ కార్యాలయంలో ఈనెల 9వతేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న ఛాత్​ పూజా కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్​, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​తో పాటు జనసేవా సంఘం అసోసియేషన్​ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ హరీష్​ మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా శామీర్​పేట, బోడుప్పల్​, మేడ్చల్​లోని హత్కేలీ చెరువు, మేడ్చల్​ చెరువులలో ఛాత్​ పూజా కర్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాలోని శామీర్​పేట చెరువు, బోడుప్పల్​ చెరువు, మేడ్చల్​లోని హత్కేలీ, మేడ్చల్​ చెరువుల వద్ద మూడు రోజుల పాటు అవసరమైన విద్యుత్తు, లైటింగ్​, టెంట్స్​, శానిటైజర్​, తాగునీటి వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్​ హరీష్​ సూచించారు. అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహించే చెరువులను పరిశుభ్రంగా ఉంచాలని… దీని కోసం అధికారులు అన్ని రకాలుగా బాధ్యతాయుతంగా వ్యవహరించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్​, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​, ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, జనసేవా సంఘం అసోసియేషన్​ కమిటీ బాధ్యులు, బీహార్​ అసోసియేషన్​ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post