జంక్షన్, ప్రదాన ప్రాంతాలు ఆకర్షనీయంగా తీర్చిదిద్దేలా చూడాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
0 0 0 0
స్మార్ట్ సిటి నిర్మాణంలో బాగంగా కరీంనగర్ లోని జంక్షన్, ప్రదాన ప్రాంతాలు మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దేలా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటి పనులలో బాగంగా నగరం మరింత ఆకర్షనీయంగా అగుపించేలా ఐడిల్స్ ఏర్పాటు, తదితరుల అంశాలపై అధికారులు, గుత్తేదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, నగరంలో ఏర్పాటు చేయనున్న ఐడిల్స్ అన్ని కూడా ఒకే విధంగా కాకుండా ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని సరికోత్త ఆకృతులను ఏర్పాటు చేసెలా చూడాలని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరీస్థితులు అనుకూలంగా ఉండడంతో పాటు ఎటువంటి పండుగలు కూడా లేనందున పనులను త్వరగా ప్రారంబించి పూర్తిచేసేలా చూడాలని తెలిపారు. ఏర్పాటు చేయనున్న ప్రతిఒక్క ఆకృతి కూడా నిజమైన వాటికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అనంతరం గుత్తేదారులు వివిధ ఐడిల్స్ ప్రజంటేషన్ ను అదనపు కలెక్టర్ కు చూపించగా వాటిలోని డిజైన్లకు డిపిఆర్, కోటేషన్లను సిద్దం చేసి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. నగర అభివృద్ది, స్మార్ట్ సిటి పనుల నిర్వహణలో ఈఈ ఆర్ ఆండ్ బి, విద్యూత్ శాఖలతో పాటుగా వివిధ శాఖల అధికారులు, గుత్తేదారులు సమన్వయంతో వ్యవహరించి పనులు సజావుగా జరిగేలా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటి మున్సిపల్ కమీషనర్ త్రియంబకేశ్వరరావు, మున్సిపల్ ఈ ఈ, డి ఈ ఈ,అధికారులు పాల్గోన్నారు.