జంగాలపల్లి గ్రామ పంచాయతీని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి:: గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

ప్రెస్ రిలీజ్…2.
తేది.4.6.2022.
ములుగు జిల్లా.

జంగాలపల్లి గ్రామ పంచాయతీని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి:: గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

౦౦౦౦౦
జంగాలపల్లి గ్రామ పంచాయతీని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

శనివారo ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి (రెండవ రోజు) కార్యక్రమములో భాగంగా మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ లతో కలసి గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గ్రామ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, వైకుంఠధామం నర్సరీ, కాంపోస్ట్ షెడ్డు, ట్రాక్టర్ ఏర్పాటు చేశామని అన్నారు.
ప్రతి గ్రామ పంచాయతీకి నిధులను ప్రతి మాసం ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం కింద చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి లోటుపాట్లను సవరించాలని అధికారులకు మంత్రి సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 8 సంవత్సరాల సమయంలోనే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని,
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను బోర్డు ద్వారా నమోదు చేసి తెలపడం శుభసూచకమని అన్నారు. జంగాలపల్లి గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ్ ఏకగ్రీవంగా ఇచ్చినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మహిళల కమ్యూనిటి భవనానికి మంజూరు చేయాలని సర్పంచ్ 10 లక్షలు కోరగా వెంటనే మంత్రి సానుకూలంగా స్పందించి 10 లక్షలు కాదు, 10 లక్షల తో పాటు మరో ఐదు లక్షలు అదనంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని వారి బాధ్యతని కర్తవ్యంగా భావించి పల్లె ప్రగతి
ఈ నెల 18 వరకు జరుగుతున్నందున ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) త్రిపాటి, డిఆర్ ఓ.
కే. రమాదేవి, డి పి ఓ కె వెంకయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి దేవరాజ్, గ్రామ సర్పంచ్ మస్రగాని అనిత,
మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post