పత్రిక ప్రకటన
తేది: 23-01-2023
నాగర్జం కర్నూల్తు జిల్లా.
పోషణ తో మానవ జన్మ సాఫల్యత
భూగోళంపై ఉన్న జీవరాశులు, వృక్ష సంపదను ప్రేమతో కాపాడినట్లైతే మానవ జన్మ కు సార్థకత చేకూరుతుంది అని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ మోతిరాం నాయక్, జిల్లా SP శ్రీ మనోహర్ అన్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలో జిల్లా జంతు సంక్షేమ సంస్థ, పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లో నిర్వహించిన జంతు సంక్షేమం పక్షోత్సవాల rallie ని ప్రారంభించి మాట్లాడారు.
భూ గోళం పై అనేక రకాలైన జంతువులు, పక్షులు, వృక్షాలు కొండలు,నదులు ,సరస్సులు వృద్దిచెందయి. అన్నింటినీ కాపాడుకుంటే నే మానవులు జీవించగలరు. ప్రకృతికి భిన్నo గా ప్రవర్తించినట్లైతే ప్రకృతి వైపరీత్యాలకు కారణమై అనేక రకాలైన జీవజాలం కనుమరుగు అవుతాయి ,ప్రకృతి సమతుల్యత కోల్పోయినపుడు మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రకృతిని జంతు జలాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉంది. విద్యార్థులకు చిన్న వయస్సు నుండి జీవుల యెడల ప్రేమ ,కరుణ అలవరచు కున్నట్లైతే భావి తరాలకు దిక్సూచి గా ఉంటారు.
ఈ కార్యక్రమంలో జంతు సంక్షేమం కు సంబందించిన అనేక స్లొగన్స్ ను విద్యార్థులు వినిపిస్తు కార్యక్రమాన్ని కొనసాగించారు.
1. జీవహింస – మహా పాతకం
2. సాటి జీవులను – ప్రేమించండి
3. జంతు పోషణ – మానవ జన్మ సాఫల్యత
4. జంతు హింస మానండి – ప్రకృతిని కాపాడండి
5. జంతు సంక్షేమం – మానవ కర్తవ్యము
6. జంతు బలులు – నేరము
7. క్యారీ బ్యాగ్స్ తో– జంతువులకు ప్రాణహాని
8. జంతు సంపదే – దేశ సంపద
9. నిరాశ్రిత జీవులకు – ఆశ్రయం కల్పించుదాము
10. గోవులను రక్షిస్తే – అవి మనలను పోషిస్తుంది
11. జంతు వాత్సల్యం – మానవత్వం
12. పెంపుడు జంతువులతో – మైత్రి వృద్ధి చేద్దాం
13. మూగ జీవులకు అపకారము చేయకుండ ఉండడమే – గొప్ప ఉపకారం
14. పక్షుల నివాసాలుగా ఉన్న – వృక్షాలను నరకరాదు
15. జంతు సంరక్షణ సేవచేయు స్వచ్చంద సంస్ధలకు – ప్రతి పౌరుడు
సహకరించవలెను
ఈ కార్యక్రమంలో జల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి వి రమేష్, అదనపు ఎస్పీ శ్రీ రామేశ్వర్, dd గ్రౌండ్ వాటర్ రమాదేవి,DAO వెంకటేశ్వర్లు ,DFO LAKSHMAPPA, DBCDO అనిల్ ప్రకాష్, DEO గోవిందరాజులు , కృష్ణా రెడ్డి, HM శ్రీ kurmaiah, పశుసంవర్ధకశాఖ సిబ్బంది, ZPHS విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేశారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూలు ద్వారా జారీ