జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు మంత్రి కెటిఆర్ నిర్ణయం

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ కంపెనీని నెలకొల్పాలని పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు నిర్ణయించారు

ఇందుకు సంబంధించి నెలకొన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి

ఈ కంపెనీ ఏర్పాటుకు  నియోజకవర్గం స్తంభంపల్లి  సైట్ లోని చిన్నపాటి గుట్ట బోళ్లను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ( టిఎస్ ఐఐసి) ద్వారా చదును చేయించాలని కెటిఆర్ నిర్ణయించి,ఈ మేరకు సంస్థ ఎండి వెంకట నర్సింహారెడ్డిని ఆదేశించారు

ఈ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి కెటిఆర్ మంగళవారం ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే,మంత్రి కొప్పుల ఈశ్వర్,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, క్రిభ్ కో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి  రాంరెడ్డిలతో సవివరంగా చర్చించారు.

అదేవిధంగా భూ సేకరణకు సంబంధించి ఏవేనీ సమస్యలు ఉంటే కూడా వెంటనే పరిష్కరించాలని కెటిఆర్ అధికారులకు తగు ఆదేశాలించారు

మంత్రి కెటిఆర్ సానుకూల స్పందన పట్ల మంత్రి కొప్పుల,ఎంపీ వెంకటేష్, ఛైర్మన్ గుప్తా సంతోషం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

మారుమూలన ఉన్న తమ ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతాంగం,ప్రజలందరూ ఇందుకు నెలకొన్న  అడ్డంకులన్నీ తొలగిపోవడంతో హర్షాతిరేకలు వ్యక్తం చేస్తూ, ఇందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న కెటిఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Share This Post