*జట్టుగా జిల్లా అభివృద్ధికి పాటుపడాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.*

*జట్టుగా జిల్లా అభివృద్ధికి పాటుపడాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.*

ప్రచురణార్థం

*జట్టుగా జిల్లా అభివృద్ధికి పాటుపడాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.*

*ఘనంగా ఉద్యోగుల సాంస్కృతిక, క్రీడా పోటీలు….*

మహబూబాబాద్, ఏప్రిల్ -26:

జట్టుగా జిల్లా అభివృద్ధికి పాటు పడాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఉద్యోగులను కోరారు.

మంగళవారం సాయంత్రం స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియం లో నిర్వహించిన ఉద్యోగుల సాంస్కృతిక, క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ కె. శశాంక, శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యే శంకర్ నాయక్,
ఎస్పీ శరత్ చంద్ర పవార్, డి.ఎఫ్. ఓ. రవికిరణ్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత నాలుగు రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న ఉద్యోగుల సాంస్కృతిక, క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. పోటీలు ప్రారంభించే సమయంలో ఉద్యోగులు పాల్గొంటారా లేదా వృధా ప్రయాస అనుకున్న సమయంలో జిల్లా అధికార యంత్రాంగం కృషితో పోటీలలో 700 మందికి పైగా ఉద్యోగులు పాల్గొనగా, 150 మంది సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ఇండోర్, అవుట్ డోర్ అన్ని కేటగిరీ లలో పోటీలు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేకంగా 50 సంవత్సరాలకు పైగా వయస్సు వారికి ప్రత్యేకంగా పోటీలు నిర్వహించామని, అందరూ ఈ పోటీల్లో పాల్గొన్నందుకు వ్యక్తిగతంగా నేను సంతోష పడ్డానని, ఉద్యోగులు తమ పిల్లల ముందు పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చిందని, ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక స్థితి, శాఖల మధ్య సమన్వయం, జిల్లా పట్ల ఒనర్షిప్, ఒక టీమ్ గా ఏర్పాటుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిన్న తనంలో ఆడిన ఆటలను రొటీన్ లైఫ్ లో మరిచామని, ఈ పోటీలలో వాటిని గుర్తించి పాల్గొన్నారని, ఉద్యోగుల్లో కళాకారులు, క్రీడాకారులు దాగి ఉన్నారని, ఈ ప్రయాణం ఇక్కడితో ఆపకుండా, దైనందిన జీవితంలో అలవాటుగా చేసుకొని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి జట్టుగా జిల్లా అభివృద్ధికి పాటు పడాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎస్పీ, డి.ఎఫ్. ఓ., సి. డబ్ల్యూ.సి. చైర్ పర్సన్ నాగవాని, తదితరులు మాట్లాడారు.

ఈ సందర్భంగా క్రికెట్, కబడ్డీ, వాలీ బాల్, త్రో బాల్, టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్, కేరొమ్స్, చెస్, స్లో సైక్లింగ్, సాక్ రేసింగ్, రన్నింగ్, షాట్ పుట్ పోటీలలో, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో సోలో, గ్రూప్ సాంగ్, సోలో, గ్రూప్ డాన్స్, కవిత్వం, మిమిక్రీ, మోనో, మైం పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులను జిల్లా కలెక్టర్, అతిథులు అందజేశారు.

ముందుగా అతిథులను ఘనంగా సన్మానించారు. సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన గేయాలు, చేసిన మిమిక్రీ ఆహుతులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, మునిసిపల్ చైర్మన్ రామోహన్ రెడ్డి, ఆర్డీవో కొమురయ్య, సి. డబ్ల్యు.సి.చైర్ పర్సన్ నాగావాని, జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పి. డీలు, పి. ఈ.టీలు, ప్రజలు, తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
——————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post