జడ్పి సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవేనేత్తిన అంశాలను ఆయ ప్రభుత్వ అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి -జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి

జడ్పి సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవేనేత్తిన అంశాలను ఆయ ప్రభుత్వ అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. సోమవారం స్థానిక తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి జడ్పి చైర్మన్ అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జడ్పి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై ఆయ జిల్లా అధికారులు స్పందించి పరిష్కరించాలని, తదుపరి సమావేశంలో తీసుకున్న చర్యలను సభా దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదే విధంగా స్టాండింగ్ కమిటి సమావేశాలకు సైతం జిల్లా అధికారులు మాత్రమె హాజరు కావాలని తమ దిగువ శ్రేణి సిబ్బందిని పంపవద్దని తెలిపారు. ఈ సమావేశంలో గత సర్వ సభ్య సమావేశంలో చర్చించి లేవనెత్తిన అంశాలను ముందుగ చర్చించారు. హాస్పిటల్ కమిటి ఏర్పాటు, మన ఇసుక వాహనం, ఆర్.ఓ.ఎఫ్ ఆర్ ద్వారా ఆమోదిత భూమి హక్కు పత్రాల జారి వంటి అంశాల పై తీసుకున్న చర్యలను చర్చించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి జడ్పిటిసి భరత్ ప్రసాద్ జడ్పిటిసిల విధులు అధికారాల పై అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యుటి లో ఉన్న డాక్టర్ ఫోన్ నెంబర్లు సూచిక బోర్డు పై పెట్టాల్సిందిగా సమావేశం దృష్టికి తెచ్చారు. కల్వకుర్తి ఎంపిపి అనిత, జడ్పిటిసి వేల్దండ డా. విజితా రెడ్డి, జడ్పిటిసి అచ్చంపేట మంత్ర్యా నాయక్, అచ్చంపేట ఎంపిపి ఆర్. శాంతి బాయి, జడ్పిటిసి ఉప్పునూతల అనంత ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి వంగూర్ కే.వి.ఎన్. రెడ్డి తదితరులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలు, మండల స్థాయి సమావేశాల ఏర్పాటు పై కమిటి దృష్టికి తీసుకు వచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఉండటం లేదని, ప్రతి దానికి మహాబుబునగర్ ప్రభుత్వ ఆసుపత్రికి లేదా హైదరాబాద్ కు సిఫారసు చేస్తున్నారని తమ నిరసన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జరుగుచున్నట్లు నాగర్కర్నూల్ జిల్లాలో సైతమ వెంటనే మన ఇసుక వాహనం ప్రారంభించాలని, ప్రజలకు ఇసుక ఇబ్బనులు లేకుండా చూడాలని సమావేశం దృష్టికి తెచ్చారు. అచ్చంపేట జడ్పిటిసి మంత్ర్య నాయక్ మాట్లడ్డుతూ ఇంతకూ ముందు ఎఫ్.ఆర్.సి కమిటి ద్వారా ఆమోదం పొందిన దాదాపు 250 మంది రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని తద్వారా రైతులకు రైతుబందు పడటం లేదని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమావేశాన్ని గడువు లోగ నిర్వహించాలని సభ్యులందరూ కోరారు.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సభ్యులు సభా దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాలను ఆయ శాఖల ద్వారా సత్వర పరిష్కారం లభించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో జడ్పి వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జడ్పి సి.ఇ.ఓ ఇంచార్జి భాగ్యలక్మిొం, అందరు జడ్పి టిసిలు, ఎంపిపి లు, కో ఆప్షన్ మెంబర్లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post