జనవరి ఒకటి,2022 నాటికి 18 సం.లు నిండి ఓటర్లుగా నమోదైన వారందరికీ ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్ లకు సూచించారు.

 

జనవరి ఒకటి,2022 నాటికి 18 సం.లు నిండి ఓటర్లుగా నమోదైన వారందరికీ ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్ లకు సూచించారు.

శశాంక్ గోయల్ బుధవారం హైద్రాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లు గా నమోదైన వారికి ఎపిక్ కార్డులు పంపిణీ తదితర అంశాలపై సూచనలు చేశారు.

జాతీయ ఓటరు దినోత్సవమైన జనవరి 25న నూతనంగా ఓటు హక్కు పొందిన యువతకు తమ ఓటర్ ఐడి కార్డు (ఎపిక్ కార్డు) ను అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

ఫోటో సిమిలర్ ఎంట్రీస్(పి ఎస్ ఈ) సాఫ్ట్వేర్ ఇచ్చామని, పోలింగ్ స్టేషన్ వారీగా సాటౌట్ చేసి బి ఎల్ వో ల కు ఇవ్వాలని,బి ఎల్ ఓ లు తప్పనిసరిగా ఆయా ఇళ్లకు వెళ్లి చెక్ చేయాలని సూచించారు.

ఏకరీతి ఫోటోలు ఉన్న జాబితా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఆన్లైన్ ద్వారా ఓటరు జాబితాలో తమ పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం, అవగాహన కల్పించాలని తెలిపారు. స్వీప్ యాక్టివిటి నిర్వహించి ఓటు హక్కు పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటర్లు గా నమోదైన 1974 మందికి జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 25 న ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు లను అందచేస్తామని ప్రధాన ఎన్నికల అధికారి కి తెలిపారు. ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల విభాగం సూపర్డెంట్ ఉమర్ పాషా, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post