జనవరి చివరి నాటికి ఆసుపత్రి విభాగాల వారీగా పడకల నిర్మాణం పూర్తి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

 

జనవరి చివరి నాటికి ఆసుపత్రి విభాగాల వారీగా పడకల నిర్మాణం పూర్తి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

 

సకాలంలో వైద్యులు విధులకు హాజరు కావాలి

 

పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలి

 

330 పడకల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

 

జనవరి చివరి వరకు జిల్లా  ఆసుపత్రి 180 అదనపు బెడ్ ల నిర్మాణ పనులు,150 బెడ్ ల మరమ్మత్తు పనులను వేగవంతంగా  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సంబంధిత ఇంజనీర్లను గుత్తేదారులు ఆదేశించారు.

గురువారం మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రి అదనపు బెడ్ నిర్మాణ పనులను పరిశీలించి, ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.  ప్రభుత్వ నాగర్ కర్నూలు నూతన మెడికల్ కాలేజీని మంజూరు చేసిన, వచ్చే విద్యా సంవత్సరం తరగతులను ప్రారంభించనున్న నేపథ్యంలో

మెడికల్ కాలేజ్ అనుబంధ ఆసుపత్రి కోసం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు 180 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను జనవరి చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణం పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అవసరమైతే రాత్రివేళల్లో సైతం లైట్ల వెలుతురులో పని జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. విభాగాల వారీగా కొనసాగుతున్న నిర్మాణ పనులు త్వరితగతిన ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు ప్రతిరోజు వందమంది కూలీలను రాత్రి పగలు పనులు చేయిస్తున్నామని సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడతామని ఏ ఎన్ ఎస్ ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థ అధికారులు కలెక్టర్కు తెలిపారు.

విభాగాల వారీగా ఏర్పాటు చేయనున్న పడగలను కలెక్టర్ పరిశీలించారు.

ఆస్పత్రిలో ప్రస్తుతి విభాగంలో కొనసాగుతున్న ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించి, గదిలో చేయవలసిన నిర్మాణ పనుల మరమ్మతులపై అధికారులతో ఆయన సమీక్షించారు.

ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన 25 పడకల ఏర్పాట్లును వారంలో  పూర్తి చేయాలని ఆదేశించారు.

నిర్మాణ పనుల వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మాణ పనులు కొనసాగించాలన్నారు.

ఆస్పత్రిలో కొవిడ్ విభాగాన్ని పరిశీలించారు.

కరోన వచ్చేవారికి రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలనన్నారు.

ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు

Share This Post